Modi Victory Speech : ఇవాళ ప్రజాస్వామ్యానికి పండుగ రోజు.. ఈసారి హోలి పండుగ మార్చి 10నే వచ్చింది : ప్రధాని మోదీ
Modi Victory Speech : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఒక్క యూపీలోనే కాదు.. ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ విజయదుందుభి మోగించింది.

Modi Victory Speech Pm Narendra Modi Victory Speech, Holi Begins From March 10 After Bjp Win Assembly Eletions
Modi Victory Speech : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఒక్క యూపీలోనే కాదు.. ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ విజయదుందుభి మోగించింది. యోగీ సారథ్యంలో యూపీలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీజేపీ విజయం సాధించింది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీనే ఆధిపత్యాన్ని సాధించింది. బీజేపీ విజయంతో పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా బీజేపీని గెలిపించిన ప్రజలకు ప్రధాన నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ‘ఇవాళ ప్రజాస్వామ్యానికి పండుగ రోజు.. ఈ ఎన్నికల ఫలితాల్లో గొప్ప సందేశం ఉంది. ఈసారి హోలీ పండుగ మార్చి 10నే మొదలైంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో గొప్ప సందేశం ఉంది’ అని మోదీ అన్నారు. 37ఏళ్ల తర్వాత యూపీలో ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తొలిసారిగా ఓటేసిన యువకులే బీజేపీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. మొదటిసారి యూపీ ప్రజలు ముఖ్యమంత్రిని కొనసాగించారని తెలిపారు. మహిళలు, యువతే బీజేపీకి మద్దతుగా నిలిచారని, మొదటిసారి ఓటర్లే బీజేపీని గెలిపించారని మోదీ చెప్పారు.

Modi Victory Speech Pm Narendra Modi Victory Speech, Holi Begins From March 10 After Bjp Win Assembly Eletions
Modi Victory Speech : సుపరిపాలన, ప్రజాభివృద్ధే మా లక్ష్యం :
ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ బలం మరింత పెరిగిందన్నారు. దేశానికి ఎందరో ప్రధానులను యూపీ ఇచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాజ్ వాదీ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు పట్టం కట్టలేదన్నారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ చరిత్ర లిఖించిందని, వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు గొప్ప సందేశాన్ని ఇచ్చారని మోదీ చెప్పారు. సుపరిపాలన, ప్రజాభివృద్ధే తమ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.
గోవా ప్రజలు బీజేపీకి మూడోసారి అధికారమిచ్చారని తెలిపారు. యూపీలో ఎస్పీని ప్రజలు నమ్మలేదని, అందుకే బీజేపీకి మళ్లీ పట్టం కట్టారని మోదీ చెప్పారు. యూపీలో కుటుంబ పాలన, అవినీతి లేదని ప్రధాని మోదీ తెలిపారు. బీజేపీ నిర్ణయాలు, విధానాలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని మోదీ పేర్కొన్నారు. దేశంలో పేదరికం తొలగించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు.