Watch Video: ఖరీదైన శాంసంగ్ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లి ఈ కోతి ఎంత పని చేసిందో చూడండి
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మనుషుల నుంచి సెల్‌ఫోన్లు, బ్యాగులు, ఇతర వస్తువులను లాక్కెలుతుంటాయి కొన్ని కోతులు. అవి ఎత్తుకెళ్లిన వస్తువులను తిరిగి వాటిని నుంచి తెచ్చుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. కోతులకు ఏమైనా ఆహార పదార్థాలు ఇస్తే తిరిగి మన వస్తువులను మనకు ఇస్తుంటాయి.
ఇటువంటి ఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలోని బృందావనంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మ్యాంగో డ్రింక్ ఫ్రూటీ కోసం ఓ యువకుడి నుంచి కోతి ఖరీదైన శాంసంగ్ ఎస్ 25 అల్ట్రాను లాక్కెళ్లింది. ఓ బాల్కనీని ఎక్కి అక్కడే కూర్చుండిపోయింది. దీంతో ఆ యువకుడు మ్యాంగో డ్రింక్ ఫ్రూటీని కోతి వైపుగా విసిరేశాడు.
Also Read: షమీ పాపం చేశాడంటూ ఇటీవలే కామెంట్స్.. ఇప్పుడు అతడి కూతురు కూడా పాపం చేసిందంటూ..
ఆ ఫ్రూటీని క్యాచ్ పట్టుకునే దాకా ఆ కోతి స్మార్ట్‌ఫోన్‌ను వదలలేదు. చివరకు ఓ ఫ్రూటీని క్యాచ్ పట్టుకుంది ఆ కోతి. దీంతో శాంసంగ్ ఎస్ 25 అల్ట్రాను ఆ కోతి కిందికి జారవిడిచింది. ఇలా తన స్మార్ట్‌ఫోన్ తనకు దక్కడంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను కార్తీక్ రాథోడ్ అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ కోతి చాలా తెలివైందని, ఆహారం కోసం మనుషులనే బ్లాక్ మెయిల్ చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి కోతులు ఉంటే మనుషులు బతికేది ఎలా అని మరో నెటిజన్ ప్రశ్నించాడు.
View this post on Instagram