Parkash Singh Badal: అంత్యక్రియల కోసం స్వగ్రామానికి బాదల్ భౌతికకాయం

బాదల్ గౌరవ సూచకంగా భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సంతాప దినాలలో, జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని, ఈ రెండు రోజులలో అధికారిక వినోదాలు ఉండవని ప్రభుత్వం తెలిపింది.

Parkash Singh Badal: అంత్యక్రియల కోసం స్వగ్రామానికి బాదల్ భౌతికకాయం

Updated On : April 27, 2023 / 7:29 AM IST

Parkash Singh Badal: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ టాప్ లీడర్ అయిన ప్రకాష్ సింగ్ బాదల్ (95) భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం ఆయన స్వగ్రామం అయితే బాదల్‭కు తీసుకువచ్చారు. గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన మొహాలీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మంగళవారం కన్ను మూశారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నాటి నుంచి సుమారు 70 ఏళ్ల ఆయన రాజకీయంలో కొనసాగారు. ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. పంజాబ్ రాజకీయాల్లో, సిక్కు మతంలో గాడ్‭ఫాదర్ లా కొనసాగారు.

Chandrababu Naidu : నా ప్రాణం అడ్డుపెట్టి మైనారిటీలను కాపాడతా, సబ్‌ప్లాన్ అమలు చేస్తా-చంద్రబాబు

కాగా, బుధవారం ప్రకాష్ సింగ్ బాదల్‭కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. బుధవారం చండీగఢ్ చేరుకున్న ఆయన.. బాదల్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి మాజీ ముఖ్యమంత్రి బాదల్‭కు అంతిమ వీడ్కోలు తెలిపారు. ప్రకాష్ సింగ్ బాదల్ లేకపోవడం తనకు వ్యక్తిగతమైన లోటని మోదీ అన్నారు. ఆయనతో దశాబ్దాలుగా చాలా సన్నిహితంగా ఉన్నానని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని మోదీ అన్నారు. దేశానికి బాదల్ ఎంతో సేవ చేశారని, ఆయన సేవల్ని గుర్తు పెట్టుకుంటూనే వాటిని కొనసాగిస్తామని అన్నారు.

B V Raghavulu : ఇదేనా మీ దమ్ము? జగన్, చంద్రబాబు, పవన్‌లపై సీపీఎం రాఘవులు తీవ్ర విమర్శలు

కాగా, బాదల్ గౌరవ సూచకంగా భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సంతాప దినాలలో, జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని, ఈ రెండు రోజులలో అధికారిక వినోదాలు ఉండవని ప్రభుత్వం తెలిపింది.