B V Raghavulu : ఇదేనా మీ దమ్ము? జగన్, చంద్రబాబు, పవన్‌లపై సీపీఎం రాఘవులు తీవ్ర విమర్శలు

BV Raghavulu: ఢిల్లీ వెళ్లి మీసం తిప్పుతారు, గదిలోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారో చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దేనికి సంకేతమో చంద్రబాబు చెప్పాలి. చేగువేర టీ షర్టులు వేసుకోవడం కాదు ఆయన స్ఫూర్తి పొందాలి.

B V Raghavulu : ఇదేనా మీ దమ్ము? జగన్, చంద్రబాబు, పవన్‌లపై సీపీఎం రాఘవులు తీవ్ర విమర్శలు

B V Raghavulu (Photo : Google)

B V Raghavulu : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో సీపీఎం నేత రాఘవులు, సీపీఐ నేత నారాయణ పాల్గొన్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ముగ్గురికీ హితబోధ చేశారు.

ఏపీలో బీజేపీవి ఉడత ఊపులు అని రాఘవులు అన్నారు. బలహీనంగా ఉన్న పార్టీని(బీజేపీ).. టీడీపీ, జనసేన, వైసీపీలు భుజం మీద మోస్తున్నాయని కామెంట్ చేశారు. బీజేపీ వల్ల జరిగే నష్టాన్ని దేశంలో అన్ని పార్టీలు గుర్తించాయన్నారు. ఆంధ్రాలో ఉన్న టీడీపీ, వైసీపీ, జనసేన మాత్రం మేల్కోవడం లేదన్నారాయన. స్టీల్ ప్లాంట్ ను కాపాడలేని జగన్ మొనగాడా? అని రాఘవులు నిలదీశారు.

Also Read..Tuni Constituency: టీడీపీ కొత్త ఎత్తులు.. జనసేనను నడిపించే నాయకుడు ఎవరు.. తునిలో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా?

ఢిల్లీ వెళ్లి మీసం తిప్పుతారు, గదిలోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. అభివృద్ధికి, రాజకీయాలకు సంబంధం లేదన్న చంద్రబాబు సిగ్గుపడాలన్నారు రాఘవులు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం రాజకీయం కదా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దేనికి సంకేతమో చంద్రబాబు చెప్పాలన్నారు. ఇక జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. చేగువేర టీ షర్టులు వేసుకోవడం కాదు ఆయన స్ఫూర్తి పొందాలని పవన్ ను ఉద్దేశించి అన్నారు.

స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పోరాటానికి రాజకీయ పార్టీలు కలిసి రావాలని రాఘవులు పిలుపునిచ్చారు. జగన్ పై కేసులున్న విషయమే సీబీఐ మరిచిపోయినట్టుందన్నారు. ముఖ్యమంత్రి ఇంటి అడ్రస్ తెలియని కారణంగానే సీబీఐ అటు వెళ్లడం లేనట్టుగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని పాతి పెట్టిన పార్టీలు, ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలు పెట్టేందుకు పోటీ పడుతున్నాయని విమర్శించారు. రాజకీయ కార్యాచరణ, పోరాటంతోనే స్టీల్ ప్లాంట్ మనుగడ సాధ్యం అని రాఘవులు తేల్చి చెప్పారు.

Also Read..AP CM Jagan: ఓ ముసలాయన అంటూ.. చంద్రబాబుపై ‘మోసపూరిత పులి’ కథ చెప్పిన జగన్‌

సీపీఐ నారాయణ..
వైసీపీ, బీజేపీ సహజీవనం చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కేంద్రానికి ఎక్కువ మద్దతు వైసీపీ నుంచే లభిస్తోంది. అందుకే మోడీ హఠావో నినాదంతో మొదలు పెట్టిన పోరాటంలో మార్పు చేశాం. జగన్, మోడీ హఠావో నినాదం తీసుకున్నాం. కేంద్రాన్ని తలుపు చెక్కలతో కొట్టినట్టు నటించి తమలపాకుతో నిమురుతున్నారు. మోడీకి బిడ్డలు లేకపోవచ్చు కానీ 30మంది దత్తపుత్రులు ఉన్నారు. వాళ్ళతోనే దోపిడీ జరుగుతోంది.