CBI Officials: సీబీఐ కస్టడీలో అల్లర్ల కేసు నిందితుడి ఆత్మహత్య.. అధికారులపై హత్య కేసు నమోదు
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బిర్భూమ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న లాలోన్ షేక్ అనే వ్యక్తి సీబీఐ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.

CBI Officials: పశ్చిమ బెంగాల్, బిర్భూమ్‌లో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అల్లర్లు ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న లాలోన్ షేక్ అనే వ్యక్తి సీబీఐ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.
Uttar Pradesh: ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీ… ఆరుగురు మృతి.. 21 మందికి గాయాలు
దీంతో బెంగాల్ పోలీసులు సీబీఐ అధికారులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బిర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో అల్లర్లు చెలరేగాయి. ఎనిమిది నెలల క్రితం జరిగిన ఈ హింసాత్మక ఘటనల్లో మహిళలు, పిల్లలుసహా పదిమందిని సజీవ దహనం చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా లాలోన్ షేక్ అనే వ్యక్తిని ఈ నెల 4న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతడి కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. అయితే, గత సోమవారం షేక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు సీబీఐ అధికారులపై కేసు నమోదు చేశారు.
కాగా, సీబీఐ అధికారులు తన భర్తను చంపుతామని బెదిరించారని, రూ.50 లక్షలు డిమాండ్ చేశారని షేక్ భార్య ఆరోపించింది. డబ్బిస్తే అతడి పేరు జాబితాలోంచి తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను సీబీఐ ఖండించింది. కాగా, తమపై నమోదైన కేసును కలకత్తా హైకోర్టులో సవాల్ చేస్తామని సీబీఐ చెప్పింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కూడా స్పందించారు. సీబీఐ అధికారుల తీరును తప్పుబట్టారు. ఆ నిందితుడు ఎలా మరణించాడో చెప్పాలని మమత డిమాండ్ చేసింది.