చెత్త పాలిటిక్స్ వల్లే సునీతా విలియమ్స్ భూమ్మీదకు రావడం లేట్.. ఎలాన్ మస్క్ సంచలనం.. ఆ రాజకీయాలు చేస్తుంది ఎవరు?

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గతేడాది జూన్ లో బోయింగ్ స్టార్‌లైన్‌ స్పేస్‌షిప్‌లో ...

చెత్త పాలిటిక్స్ వల్లే సునీతా విలియమ్స్ భూమ్మీదకు రావడం లేట్.. ఎలాన్ మస్క్ సంచలనం.. ఆ రాజకీయాలు చేస్తుంది ఎవరు?

Elon musk

Updated On : February 20, 2025 / 10:42 AM IST

Elon Musk: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గతేడాది జూన్ లో బోయింగ్ స్టార్‌లైన్‌ స్పేస్‌షిప్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లిన వ్యోమగాములు స్టార్‌లైన్ లో సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారిని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వరుసగా విఫలమవుతూ వస్తున్నాయి. దీంతో దాదాపు ఎనిమిది నెలలుగా వారు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు.

 

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ సాయం కోరారు. దీంతో ఎలాన్ మస్క్ బృందం వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఇద్దరూ కలిసి ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవటానికి ప్రధాన కారణాలు రాజకీయాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

‘‘గత అధ్యక్షుడు బైడెన్ తో పాటు అతని పాలనా యంత్రాంగం వ్యోమగామిలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే వదిలేయాలని అనుకున్నారు. వ్యోమగాముల పునరాగమనానికి అనుమతి ఇవ్వడానికి బైడెన్ నిరాకరించారని, దీని వల్ల వారు అక్కడే చిక్కుకుపోయారని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఎలాన్ మస్క్ సమర్ధించారు. అవును, రాజకీయ కారణాల వల్ల వారిని అక్కడే వదిలేశారు. ఇది మంచిది కాదు అన్నారు. వారిని భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియ హాస్యాస్పదమైన స్థాయిలో వాయిదా పడింది. ట్రంప్ అభ్యర్థన మేరకు వ్యోమగాములను తిరిగి తీసుకురావడాన్ని మేము వేగవంతం చేశామని మస్క్ చెప్పారు. తన బృందం చాలా జాగ్రత్తగా ఉంటుంది. గతంలో అనేకసార్లు అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములను విజయవంతంగా తిరిగి తీసుకొచ్చారని మస్క్ అన్నారు. అయితే, ట్రంప్, మస్క్ వ్యాఖ్యలపై బైడెన్ వర్గం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

 

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ బృందం పనిచేస్తుంది. అయితే, వ్యోమగాములు భూమిపైకి రావడానికి ఎన్నిరోజులు సమయం పడుతుందని ప్రశ్నించగా.. వారిని తిరిగి తీసుకురావడానికి దాదాపు నాలుగు వారాలు పడుతుందని భావిస్తున్నామని మస్క్ చెప్పారు.

 

సునీత విలియమ్స్, విల్మోర్ సీఎన్ఎన్ తో మాట్లాడుతూ.. మేము అంతరిక్ష కేంద్రంలో వదిలివేయబడినట్లు భావించడం లేదు. మేము ఇరుక్కుపోయినట్లు భావిచండం లేదు. మేము ఒంటరిగా ఉన్నట్లు భావించడం లేదు.. ఇతరులు ఎందుకు అలా ఆలోచిస్తారో నాకు అర్ధమైంది అంటూ విల్మోర్ అన్నారు. విలియమ్సన్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని పంచుకుంటూ ‘బుచ్, నాకు ఇది ఒక టెస్ట్ ప్లైట్ అని తెలుసు. స్టార్ లైనర్ లో కొన్ని తప్పులు ఉంటాయని మాకు తెలుసు. మేము కొన్ని వస్తువులను కనుగొన్నాము. కాబట్టి అది ఆశ్చర్యం కలిగించలేదు అని అన్నారు.