UFO in Gujarat: రాత్రి ఆకాశంలో వింత.. ఏలియన్స్ వచ్చారా?
మనం భూమ్మీద నివసిస్తున్నట్లుగానే ఇతర గ్రహాల మీద కూడా ప్రాణులున్నారా? వేరే గ్రహాల మీద జీవరాసులు మన గ్రహం మీద టార్గెట్ చేశారా? మనకన్నా ఎన్నో వేల రేట్లు అడ్వాన్స్ గా ఉన్న ఆ జీవులు మన గ్రహం మీదకి వచ్చి వెళ్తాయా? భూమి మీద గుర్తు తెలియని ఎగిరే వాహనాలు దేనికి సంకేతం? అసలు ఏలియన్స్ ఉన్నారా?

Ufo In Gujarat (1)
UFO in Gujarat: మనం భూమ్మీద నివసిస్తున్నట్లుగానే ఇతర గ్రహాల మీద కూడా ప్రాణులున్నారా? వేరే గ్రహాల మీద జీవరాసులు మన గ్రహం మీద టార్గెట్ చేశారా? మనకన్నా ఎన్నో వేల రేట్లు అడ్వాన్స్ గా ఉన్న ఆ జీవులు మన గ్రహం మీదకి వచ్చి వెళ్తాయా? భూమి మీద గుర్తు తెలియని ఎగిరే వాహనాలు దేనికి సంకేతం? అసలు ఏలియన్స్ ఉన్నారా? ఉంటే ఎప్పుడు ఎలా వస్తారు.. ఎలా ఉంటారు.. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం యావత్ ప్రపంచమంతా ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉంది.
మన దేశంలో ఏలియన్స్ లేదా ఎగిరే వస్తువులు కనిపించడం అరుదే కాగా అమెరికా లాంటి దేశాలలో అవి ఎప్పటికప్పుడు కనిపించడంతో పాటు అక్కడ పరిశోధనలు ఎక్కువే. కాగా.. మన దేశంలో కూడా అలాంటి చర్చ మళ్ళీ వచ్చింది. దానికి కారణం గుజరాత్ లో రాత్రి సమయంలో ఆకాశంలో కనిపించిన దృశ్యం. గుజరాత్‌లోని జునాగఢ్ నగరంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆకాశంలో వింత కాంతి కనిపించింది. అంతకు ముందెన్నడూ కనిపించని ఆ కాంతిని ప్రజలంతా ఆశ్చర్యపోయి చూశారు.
ఆ కాంతికి కారణం ఏంటన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రంగురంగుల్లో మెరుస్తూ నాలుగు లైట్ల మాదిరి కాంతితో కనిపించిన అది ఉల్క కావచ్చని కొందరు.. కాదు కాదు హెలికాఫ్టర్ లేదా ఏదైనా ఆర్మీ వాహనం కావచ్చని కొందరు వాదిస్తుంటే మరికొందరు.. అది అసలు మన దేశంలో సాధారణ వాహనమే కాదని.. ఇతర గ్రహాల మీద నుండి వచ్చిన యూఎఫ్ఓ (UFO) కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా.. ఇవి ఆకాశంలో వెళ్తున్న సమయంలో కొందరు ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారింది.