Narendra Modi: మేము మూడోసారి అధికారంలోకి వచ్చాక…: మోదీ ఆసక్తికర కామెంట్స్

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ లో నిర్మించిన ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (IECC)ను మోదీ ప్రారంభించారు.

Narendra Modi: మేము మూడోసారి అధికారంలోకి వచ్చాక…: మోదీ ఆసక్తికర కామెంట్స్

Narendra Modi

Updated On : July 26, 2023 / 9:36 PM IST

Narendra Modi – Worlds Top 3 Economies: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మూడోసారి ప్రధానిని అయ్యాక ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాల జాబితాలో భారత్ (India) టాప్-3లో ఉంటుందని చెప్పారు. ఇది మోదీ గ్యారెంటీ అని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ లో నిర్మించిన ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (IECC)ను మోదీ ప్రారంభించారు. భారత్‌ మండపంగా పేరు పెట్టిన ఇందులో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. బీజేపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది మూడో సారి అధికారంలోకి వచ్చాక దేశం మునుపెన్నడూ లేనంత వృద్ధిని సాధిస్తుందని చెప్పారు.

తూర్పు నుంచి పశ్చిమం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారత్ లో మౌళిక సదుపాయాల కల్పనలో మార్పులు వస్తున్నాయని మోదీ తెలిపారు. దేశ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

తాను మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉందని, రెండో సారి వచ్చినప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని మోదీ తెలిపారు. ఆ ట్రాక్ రికార్డు ఆధారంగా చూసుకుంటే దేశం తాము మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని అన్నారు.

No Confidence Motion : అవిశ్వాస తీర్మానంతో ఆ పార్టీల ముసుగు తొలగిపోతుందా?