Mars: అంగారకుడిపై కొంతకాలం ఆవాసయోగ్య పరిస్థితులు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు

నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ పంపించిన చిత్రాల ఆధారంగా.. అంగారకుడిపై మట్టిలో పగుళ్లు ఏర్పడేవరకూ నీటి జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు

Mars: అంగారకుడిపై కొంతకాలం ఆవాసయోగ్య పరిస్థితులు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు

Mars

Updated On : August 11, 2023 / 8:25 AM IST

Nasa: భూమికి పొరుగునే ఉన్న అంగారకుడిపై మానవుడి జీవనం సాధ్యమేనా? ఆ పరిస్థితులు రాబోయే కాలంలో ఉన్నాయా? అనే విషయాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు. అంగారకుడిపై ఆవాసయోగ్య పరిస్థితులు ఉండిఉంటాయని తెలిపారు. అంగారకుడిపై ఒకప్పుడు పొడి, తేమతో కూడిన రుతువులు ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అక్కడ జీవుల నివాసానికి అనువైన పరిస్థితులు ఉండి ఉంటాయని తెలిపారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి నేలపై పగుళ్ల తీరుకు సంబంధించిన చిత్రాలను అందించింది. వాటిని విశ్లేషించిన శాస్త్రవేత్తలు, అంగారకుడిపై కొంతకాలం పాటు నీరు ఉండేదని, ఆ తరువాత ఆవిరైందని గుర్తించారు.

NASA : అంతరిక్షంలో వ్యోమగాములు చనిపోతే మృతదేహాన్ని ఎలా భద్రపరుస్తారు..?భూమికి ఎలా తీసుకొస్తారు..?నాసా చెబుతున్న ఆసక్తికర విషయాలు

నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ పంపించిన చిత్రాల ఆధారంగా.. అంగారకుడిపై మట్టిలో పగుళ్లు ఏర్పడేవరకూ నీటి జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, ఒకప్పుడు వేడి, తేమతో కూడిన ఆ గ్రహం శీతలంగా, పొడిగా ఎలా మారిందన్న విషయాలపై స్పష్టత లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అంగారకుడిపై గతంలో నీటి జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పలు ఆధారాల ద్వారా పేర్కొంటున్నారు. ఇందులో ప్రధానమైంది.. భూమి మీద మట్టిలో వచ్చే పగుళ్లు తొలుత ఇంగ్లీష్‌లో ‘టి’ ఆకారంలో ఉండేవి. ఆ తరువాత అక్కడ నీరు చేరడం మళ్లీ అది ఎండిపోవడం వల్ల ఆ పగుళ్లు ‘వై’ ఆకారంలో మారాయి. అంగారక గ్రహంపై కూడా ఈ వై ఆకృతి పగుళ్లు కనిపించాయని, దీనిని బట్టి అక్కడ కూడా తడి, పొడి సీజన్లు ఉండేవని అర్థమవుతోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

NASA Spacecraft : సూర్యుడికి చేరువైన నాసా స్పేస్ క్రాఫ్ట్.. సౌర తుఫాన్ లపై ప్రత్యేక అధ్యయనం

శాస్త్రవేత్తలు పలు పరిశోధనల తరువాత అంగారకుడిపై ఒకప్పుడు భూమిని పోలిన వాతావరణం ఉండేదని తెలిపారు. నివాసయోగ్య పరిస్థితులూ ఉండేవన్నారు. ఇదిలాఉంటే భూమిపై కాకుండా ఇతర గ్రహాల్లో జీవం ఉందా? అనేది తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నోఏళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా నాసా అంగారక గ్రహంపైకి రోవర్‌ను పంపించింది. ఆ రోవర్ అంగారక గ్రహంపై తాజా పరిస్థితులను ఫొటోలు తీసి పంపించింది.