Tripura : త్రిపురలో రెండు గ్రూపులపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిషేధం

త్రిపుర రాష్ట్రంలో రెండు గ్రూపులపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నిషేధం విధించింది. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర,ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్‌లోని అన్ని వర్గాలు, అనుబంధ విభాగాలను చట్టవిరుద్ధమైన గ్రూపులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది....

Tripura : త్రిపురలో రెండు గ్రూపులపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిషేధం

Ministry of Home Affairs

Tripura : త్రిపుర రాష్ట్రంలో రెండు గ్రూపులపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నిషేధం విధించింది. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర,ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్‌లోని అన్ని వర్గాలు, అనుబంధ విభాగాలను చట్టవిరుద్ధమైన గ్రూపులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం కింద చేసిన డిక్లరేషన్ బుధవారం (అక్టోబర్ 3) నుంచి అమలులోకి వచ్చింది. ఈ గ్రూపులకు అనుబంధంగా ఉన్న అన్ని వర్గాలు, ఫ్రంట్ ఆర్గనైజేషన్‌లను ఐదేళ్ల పాటు నిషేధం విధించారు.

Also Read : Bus Accident : ఇటలీలో ఘోర బస్సు ప్రమాదం…21 మంది మృతి

చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం 1967 లోని సెక్షన్ 3లోని సబ్ సెక్షన్ 1 ద్వారా కేంద్రం ఈ నిషేధాస్త్రం విధించింది. త్రిపురలో ఈ రెండు గ్రూపులు విధ్వంసం, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఇటీవల ఈ గ్రూపులు భారతదేశ సార్వభౌమాధికారం,సమగ్రతకు విఘాతం కలిగించే హింసాత్మక, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొంటూ, పోలీసు, భద్రతా దళాలకు చెందిన సిబ్బంది, పౌరులను చంపుతున్నారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది.

Also Read : Bandi Sanjay : దమ్ముంటే.. అలా అనలేదని అమ్మవారి ఆలయం ముందు ప్రమాణం చేయాలి? కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

ఈ గ్రూపుల కార్యకర్తలు త్రిపుర వ్యాపారుల నుంచి అక్రమంగా నిధులు వసూలు చేయడం, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సేకరించడం లాంటి పనులకు పాల్పడుతున్నారు. వేర్పాటువాద, విధ్వంసక, హింసాత్మక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ రెండు గ్రూపులపై నిషేధం విధించామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.