Navjot Singh Sidhu : పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. ప్రజా తీర్పును శిరసావహిస్తా : నవజ్యోత్ సింగ్
Navjot Singh Sidhu : పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. పంజాబ్‌ను కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేసింది. ఆప్ ప్రభంజనంతో కాంగ్రెస్, అకాలీదళ్ చీపురుతో ఊడ్చేసింది.

Navjot Sidhu Says Punjab Took An Excellent Decision After Aap's Big Win
Navjot Singh Sidhu : పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. పంజాబ్‌ను కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేసింది. ఆప్ ప్రభంజనానికి కాంగ్రెస్, అకాలీదళ్ చీపురు దాటికి ఊడ్చుకుపోయాయి. పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాజయం పాలయ్యారు. ఒక రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన ఆప్.. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చి దశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. ఆప్ దెబ్బకు పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పరాజయం పాలయ్యారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 స్థానాలు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ 18, అకాలీదళ్ కూటమి 4 స్థానాలకే పరిమితమయ్యాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నవజ్యోత్ సింగ్ ఫలితాల అనంతరం మొదటిసారి మీడియాతో మాట్లాడారు. పంజాబ్ ప్రజల తీర్పును గౌరవిస్తూ శిరసావహిస్తానని సింగ్ తెలిపారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇప్పుడే అదే జరిగిందన్నారు. రాష్ట్రంలో కొత్త పాలన అవసరం ఉందని, ఆ విషయంలో పంజాబ్ ప్రజలు తీసుకున్న నిర్ణయం అద్భుతమని సింగ్ భినందించారు. ప్రజల నిర్ణయంతో మీరెలా ఏకీభవిస్తున్నారని అడిగిన ప్రశ్నకు.. ప్రజలు మార్పును కోరుకున్నారని, వారు ఎప్పటికీ తప్పు చేయరని సింగ్ అన్నారు. ప్రజల స్వరం.. భగవంతుని స్వరమని సింగ్ అభివర్ణించారు. ప్రజల నిర్ణయాన్ని మనం వినయంతో అర్థం చేసుకోవాలి.. వారికి నమస్కరించాలని నవజ్యోత్ సింగ్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం నవజ్యోత్ సింగ్ లో ఎలాంటి బాధకరమైన సంకేతాలు కనిపించలేదు. ఎలాంటి అసహనాన్ని వ్యక్తపర్చకుండా చాలా ఓపిగ్గా సమాధానమిచ్చారు. పంజాబ్ అభ్యున్నతి తన ధ్యేయమన్నారు. ఈ విషయంలో తాను ఎప్పుడూ విశ్రమించనని స్పష్టం చేశారు.
‘ఒక యోగి ధర్మయుద్ధంలో ఉన్నప్పుడు.. అన్ని బంధాలను తెంచుకుంటారు.. వారికి ఎలాంటి హద్దులు ఉండవు.. చివరికి మరణానికి కూడా వారు భయపడరు. నేను ఇక్కడ పంజాబ్‌లో ఉన్నాను.. ఇక్కడే ఉంటాను. ఎవరైనా ఉన్నత లక్ష్యంతో పంజాబ్ అభివృద్ధికై ముందుకు వచ్చినప్పుడు వారి గెలుపు లేదా ఓటముల గురించి ఎప్పుడూ పట్టించుకోను’ అని సింగ్ చెప్పుకొచ్చాడు. ప్రజలతో నా అనుబంధం స్థిరమైనది కాదన్నారు. అదో ఆధ్యాత్మికం, హృదయం. ప్రజలతో నా సంబంధం ఎన్నికల్లో గెలుపు, ఓటములకు మాత్రమే పరిమితం కాదని తెలిపారు. పంజాబ్ ప్రజలలో నేను దేవుడిని, వారి సంక్షేమంలో నా సంక్షేమాన్ని చూస్తున్నానని నవజ్యోత్ సింగ్ చెప్పుకొచ్చారు. సిద్ధూ అమృత్‌సర్ తూర్పు స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన జీవన్‌జ్యోత్ కౌర్ చేతిలో 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సింగ్‌కు మొత్తం 32,929 ఓట్లు రాగా.. ఎమ్మెల్యే కౌర్‌కు 39,520 ఓట్లు వచ్చాయి.
Read Also : Aam Aadmi party : పంజాబ్ పీఠం దక్కింది..ఇక గుజరాత్ పై గురి పెట్టిన ‘ఆప్’