Navjot Singh Sidhu : గంగమ్మ ఒడిలో కూర్చుని సిద్ధూ కుమారుడి నిశ్చితార్థం .. నా కుమారుడు తన తల్లి కోరిక నెరవేర్చాడని ట్వీట్

కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు కుమారుడి నిశ్చితార్థాన్ని వినూత్నంగా జరిపారు. పవిత్ర గంగానది నీటిలో కాబోయే కోడలిని వినూత్నంగా పరిచయం చేశారు. గంగమ్మ ఒడిలోనే నిశ్చితార్థం జరిపించారు.

Navjot Singh Sidhu : గంగమ్మ ఒడిలో కూర్చుని సిద్ధూ కుమారుడి నిశ్చితార్థం .. నా కుమారుడు తన తల్లి కోరిక నెరవేర్చాడని ట్వీట్

Navjot Singh Sidhu son Engagement In Ganga river

Updated On : June 27, 2023 / 4:43 PM IST

Navjot Singh Sidhu son Engagement In Ganga river : కాంగ్రెస్ నేత(Congress) , పంజాబ్ కాంగ్రస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu)  కుమారుడు కరణ్ సిద్ధూ(Karan Sidhu)కు కాబోయే భార్యను వినూత్నంగా పరిచయం చేశారు. తన కుమారుడు కరణ్ సిద్ధూ(Karan Sidhu)కు పాటియాలకు చెందిన ఇనాయత్ రంథావా( Inayat Randhawa)ను ఇచ్చి వివాహం చేయనున్నారు. కుమారుడు, కాబోయే కోడలు, సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూతో కలిసి వినూత్నంగా గంగానదిలో కనిపించారు. గంగమ్మ ఒడిలో (Ganga river)లో నీటిలో కూర్చుని పక్కనే గులాబీ పూల దండలు కనిపిస్తుండగా నిశ్చితార్థం జరిగినట్లుగా ఉన్న ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో సిద్ధూ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయని ఇలా వినూత్నంగా పవిత్ర గంగానది ఒడిలో కూర్చుని ప్రకటించారు సిద్ధూ.

మరోపక్క కరణ్ సిద్ధూ తనకు కాబోయే భార్య ఇనాయత్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దుర్గాష్టమి రోజున (Durga-Ashtami day )ఇలా పవిత్ర గంగానది ఒడిలో నిశ్చితార్థం (Engagement)చేసారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇలా అత్యంత నిరాడంబరంగా వినూత్నంగా నిశ్చితార్థం జరిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సిద్ధూ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ కాబోయే కోడలిని పరిచయం చేశారు.

Pawan Kalyan : తూర్పుకాపుల్లో బలమైన నాయకులున్నా.. వారు వెనుకబడే ఉన్నారు : పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా సిద్ధూ ‘‘నా కుమారుడు తన తల్లి కోరికను నెరవేర్చాడు. పవిత్ర దుర్గా-అష్టమి వ్రత తిథి (జూన్‌ 26న) నాడు గంగామాత ఒడిలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. మా కాబోయే కోడలు ఇనాయత్‌ రంధావా. వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు’ అంటూ సిద్ధూ (Navjot Singh Sidhu) ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఈ ఫోటోల్లో సిద్ధూ, ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూ(Navjot Kaur Sidhu), కుమార్తె రబియా సిద్ధూ (Rabia Sidhu)కూడా ఉన్నారు. పాటియాలాకు చెందిన మనీందర్‌ రంధావా కుమార్తె ఇనాయత్‌. మనీందర్ గతంలో ఆర్మీలో పనిచేశారు. ప్రస్తుతం పంజాబ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ముద్దుల కుమార్తెతో సిద్ధూ కుమారుడి వివాహం జరుగనుంది.

PM Modi : మీ కుటుంబం బాగుండాలంటే బీజేపీకి ఓటేయండీ .. కేసీఆర్ కుటుంబం బాగుండాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి : ప్రధాని మోదీ