పాకిస్థాన్‌, చైనా కుట్రలను గమనిస్తూనే భారత నౌకాదళం ఇంకా ఏం చేస్తోందో తెలుసా? ఢీ అంటే ఢీ..

Indian Navy: ఈ మూడు నాలుగు నెలల వ్యవధిలోనే ఇలాంటివి ఆరేడు ఘటనలు జరిగాయి.

పాకిస్థాన్‌, చైనా కుట్రలను గమనిస్తూనే భారత నౌకాదళం ఇంకా ఏం చేస్తోందో తెలుసా? ఢీ అంటే ఢీ..

Anti-Piracy Ops

అసలే నడి సముద్రం. అనుకోని ఆపద. ఎటు చూసిన చిమ్మని చీకట్లు. శత్రువు ఏ రూపంలో ఎంత పటిష్టంగా ఉన్నాడో తెలియదు. కానీ టార్గెట్ ఒక్కటే. ఊహించని కష్టంలో ఉన్నోళ్లకు గుండె ధైర్యం నింపి.. ప్రాణాలతో కాపాడటమే లక్ష్యం. అది శత్రువైనా, మిత్రువైనా. ఇదే సంకల్పంతో సముద్రదొంగలను ఆటకట్టిస్తోంది ఇండియన్ నేవీ. ఆపరేషన్ సంకల్ప్‌ పేరుతో ఓవైపు సముద్ర మార్గంలో పాకిస్థాన్‌, చైనా లాంటి కుట్రలను గమనిస్తూనే మరోవైపు సీలో.. కేటుగాళ్ల ఆటగట్టిస్తోంది భారత నౌకాదళం.

నౌకలను చుట్టుముట్టి అందినకాడికి దోచుకెళ్ళడమే సముద్రదొంగల టార్గెట్. కాదుకూడదంటే ఎదురుతిరిగితే చంపడానికి కూడా వెనకాడరు. ఒకసారి సముద్ర దొంగలు నౌకను చుట్టుముట్టారంటే లూటీ చేశాకే వెళ్లిపోతారు. అంత డేంజరస్‌గా ఉంటారు. అంతటి కేటుగాళ్లను కూడా చీల్చిచెండాడుతోంది ఇండియన్ ఏవీ. ఎంత పెద్ద దొంగలు అయినా తోకముడిచి..అన్నీ మూసుకుని సముద్రం నడిబొడ్డున మనకు సలాం కొట్టేలా డేరింగ్ ఆపరేషన్స్ చేస్తుంది భారత నౌకాదళం.

ఢీ అంటే ఢీ..
అమెరికా లాంటి అగ్రదేశాలు కూడా సముద్ర దొంగలకు వణికిపోతున్నాయి. ఆ కేటుగాళ్లను కట్టడి చేయలేక అవస్థలు పడుతున్నాయి. కానీ ఇండియన్ నేవీ మాత్రం ఢీ అంటే ఢీ అంటూ నడిసముద్రంలో తొడగొడుతోంది. కొన్నాళ్లుగా మన నౌకాదళం చేపడుతున్న ఆపరేషన్స్.. ఆంతర్జాతీయంగా సెన్సేషన్‌ అవుతున్నాయి. దొంగలను వేటాడి..వెంటాడి పట్టుకుంటున్న తీరుతో అన్నిదేశాలు ఇండియన్ నేవీ పటిష్టతపై ఫోకస్ పెట్టాయి.

రెచ్చిపోతున్న సముద్రదొంగలకు భారత్ నేవీ ఆపరేషన్స్‌తో దిమ్మదిరిగిపోతుంది. పదిరోజుల వ్యవధిలో మూడుకీలక ఆపరేషన్లు చేసింది ఇండియన్ నేవీ. మార్చి 28న సోకోట్రా తీరానికి 90నాటికల్ మైళ్ల దూరంలో చేపలబోటుపై దాడి జరిగింది. బోటులో 23 మంది పాకిస్థానీ సిబ్బంది చిక్కుకున్నారు. నిఘా ద్వారా సమాచారం రాగానే రెండు భారత యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. 12 గంటల పాటు శ్రమించి దొంగలను అరెస్ట్ చేశారు నేవీ సిబ్బంది. బోటులో ఉన్న 23 మంది పాకిస్థానీ సిబ్బందిని కాపాడారు. భారత్ నేవీ సాహసానికి, సత్తాకు ఫిదా అయినా పాకిస్థానీయులు.. జైహింద్ అంటూ స్లోగన్స్ ఇచ్చి తమ కృతజ్ఞతను తెలిపారు.

తొలుత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమేధ..దొంగలు హైజాక్ చేసిన నావను అడ్డగించింది. ఆ తర్వాత సుమేధకు తోడుగా ఐఎన్ఎస్ త్రిశూల్‌ కూడా రంగంలోకి దిగింది. దొంగలు ఎంతకు లొంగిపోకపోవడంతో తీవ్రంగా శ్రమించింది ఇండియన్ నేవీ. నాన్‌ స్టాప్‌గా హాఫ్ డే ఆపరేషన్ తర్వాత దొంగలను అదుపులోకి తీసుకున్నారు నేవీ అధికారులు.

జనవరి చివరివారంలోనూ ఇదే రకమైన ఆపరేషన్‌ను చేసి సముద్ర దొంగలను ఆకట్టించారు నేవీ సిబ్బంది. మరోనౌకను సముద్రపు దొంగల దాడి నుంచి కాపాడారు. భారత తీరానికి దాదాపు 2వేల 6వందల కిలోమీటర్ల దూరంలో పైరేట్లు రూయెన్ అనే నౌకపై దాడి చేశారు. ఇన్ఫర్మేషన్ రాగానే ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధనౌక రంగంలోకి దిగి పైరేట్లను తరిమికొట్టింది.

దొంగల తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నించడం.. ఎంతకు లొంగిపోకపోవడంతో మల్లిపుల్ ఆపరేషన్స్ చేశారు. ఇందులో ఐఎన్ఎస్ సుభద్ర కూడా ఉపయోగపడింది. P8I విమానం, సీ గార్డియన్ యూఏవీ, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన డ్రోన్లను వాడి.. 40 గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఈ ఘటనలో 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోయారు. రూయెన్‌ నౌకలోని 17 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

ఆరేడు ఘటనలు
ఈ మూడు నాలుగు నెలల వ్యవధిలోనే ఇలాంటివి ఆరేడు ఘటనలు జరిగాయి. సముద్రంలో పైరేట్స్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను నేవీ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తోంది. ఎంత హెచ్చరించినా వినకుండా భారత నేవీ హెలీకాఫ్టర్‌పై సముద్రపు దొంగలు కాల్పులు జరుపుతున్నారు.

బంగ్లాదేశ్‌ బల్క్ క్యారియర్ ఎంవీ రాయెన్ ఓడను సోమాలియా సముద్రపు దొంగలు నిరుడు హైజాక్ చేశారు. ఆ షిష్‌ను సేవ్ చేశారు నేవీ సిబ్బంది. జనవరి 5న లైబీరియన్‌ జెండాతో అరేబియా సముద్రంలో వెళ్తున్న నౌకను హైజాక్‌ చేసేందుకు సముద్రపు దొంగలు ప్రయ‌త్నించారు. ఈ ప్రయ‌త్నాల‌ను కూడా భార‌త నేవీ నిలువరించింది. దాంతో బల్దేరియా ప్రెసిడెంట్, ఉపప్రధాని భారత్‌కు థ్యాంక్స్ చెప్పారు.

ప్రయాణికుడికి రూ.7.66 కోట్ల బిల్లు వేసిన ఉబర్ ఆటో.. వీడియో చూస్తారా?