Chattishgarh : అడవిలో తుపాకుల మోత, భారీ సంఖ్యలో మావోయిస్టుల మృతి ?

కాంకర్ జిల్లాలోని కోస్రాండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, ఎస్ఎస్బీ బృందాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. పోలీసులు కనబడడంతో...

Chattishgarh : అడవిలో తుపాకుల మోత, భారీ సంఖ్యలో మావోయిస్టుల మృతి ?

chattishgarh

Updated On : February 18, 2022 / 12:44 PM IST

Naxals open Fire : కాల్పుల మోతతో అడవి దద్దరిల్లుతోంది. గత కొన్ని రోజులుగా నిశబ్దంగా ఉన్న అడవిలో మావోయిస్టుల అలజడి కలకలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య కాల్పులతో సమీపంలో ఉన్న ఆదివాసీలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దాదాపు పెద్ద సంఖ్యలో మావోయిస్టులున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన కాంకర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Read More : Ahmedabad Bomb Blast : అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు

కాంకర్ జిల్లాలోని కోస్రాండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, ఎస్ఎస్బీ బృందాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. పోలీసులు కనబడడంతో వారు కాల్పులకు తెగబడ్డారు. 2022, ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. భీకరంగా కాల్పులు జరుగుతుండడంతో ఆ ప్రాంతం దద్ధరిల్లుతోంది. గంటల తరబడి జరుగుతున్న ఈ కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెంది ఉంటారని ఎస్పీ శలబ్ సిన్హా ప్రకటించారు. కోస్రోండా అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులున్నట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలను ఈడ్చుకెళ్లిన జాడలను పోలీసు బలగాలు గుర్తించాయి. అయితే.. ఎన్ కౌంటర్ లో ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఈ ఘటనపై పోలీసుల ఉన్నతాధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.