బిహార్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ.. మహాఘట్‌బంధన్‌ కంటే డబుల్‌ సీట్లు

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 122 స్థానాల మెజార్టీ అవసరం.

బిహార్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ.. మహాఘట్‌బంధన్‌ కంటే డబుల్‌ సీట్లు

Updated On : November 14, 2025 / 9:54 AM IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్ దాటింది. 155కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాఘట్‌బంధన్ 70కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు కనీసం 5 స్థానాల్లోనైనా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. 243 స్థానాలకు బిహార్‌లో ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 122 స్థానాల మెజార్టీ అవసరం. “గెలుపు” ఫలితాలు ఇంకా రాకపోయినప్పటికీ ఆధిక్యంలో ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది.

Also Read: Bihar Assembly Election Results: దుమ్ముదులుపుతున్న ఎన్డీఏ.. లైవ్‌ అప్‌డేట్స్‌

ఎన్‌డీఏ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జనతా దళ్‌ (యునైటెడ్‌), భారతీయ జనతా పార్టీ 101 స్థానాల చొప్పున పోటీ చేయగా, లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) 29 స్థానాల్లో, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌), రాష్ట్రీయ లోక్‌ మోర్చా తలా 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

మహాఘట్‌బంధన్‌లో రాష్ట్రీయ జనతా దళ్‌ 143 స్థానాల్లో, కాంగ్రెస్‌ 61 స్థానాల్లో, సీపీఐ 9, సీపీఎం 4, సీపీఐ(ఎం-ఎల్)ఎల్‌ 20, వికాస్‌శీల ఇన్సాన్‌ పార్టీ 15 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.