జోకర్ ఆఫ్ ది ఇయర్.. NDA ప్రభుత్వం : కాంగ్రెస్ కౌంటర్

కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోంది. కాంగ్రెస్ నేత

  • Published By: veegamteam ,Published On : December 29, 2019 / 03:49 AM IST
జోకర్ ఆఫ్ ది ఇయర్.. NDA ప్రభుత్వం : కాంగ్రెస్ కౌంటర్

Updated On : December 29, 2019 / 3:49 AM IST

కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోంది. కాంగ్రెస్ నేత

కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ‘ఈ సంవత్సరపు అబద్ధాల పుట్ట’గా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అభివర్ణించారు. దీనికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా బదులిచ్చారు. NDA ని ‘ఈ సంవత్సరపు జోకర్’ (జోకర్ ఆఫ్ ది ఇయర్)గా రంజన్ చౌదరి అభివర్ణించారు. శనివారం(డిసెంబర్ 28,2019) మీడియాతో మాట్లాడిన రంజన్.. ప్రధాని మోడీ అబద్ధాలాడుతున్నారో, రాహుల్ గాంధీ అబద్ధాలకోరో తేల్చుకునేందుకు చర్చకు సిద్ధమా? అని ప్రకాష్ జవదేకర్‌కు సవాల్ విసిరారు.
 
తనను అబద్ధాల కోరుగా కేంద్ర మంత్రి అనడంపై రాహుల్ గాంధీ సైతం ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడా నిర్బంధ కేంద్రాలు లేవంటూ ప్రధాని చెప్పిన వీడియోను తాను ట్వీట్ చేశానని, అదే వీడియోలో నిర్బంధ కేంద్రాల విజువల్స్‌ను కూడా పోస్ట్ చేశానని, అది చూసి ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ప్రజలు, మీడియానే తేల్చుకోవాలని రాహుల్ అన్నారు.