Covid-19 Cases: భారత్‌లో కొనసాగుతోన్న కొవిడ్-19 విజృంభణ.. భారీగా నమోదైన కొత్తకేసులు..

దేశంలో కొవిడ్-19 కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజువారి కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది.

Covid-19 Cases: భారత్‌లో కొనసాగుతోన్న కొవిడ్-19 విజృంభణ.. భారీగా నమోదైన కొత్తకేసులు..

Covid-19 Cases

Covid-19 Cases: భారత్‌లో కొవిడ్ -19 విజృంభణ కొనసాగుతోంది. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 11,109 కొత్త కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కు చేరింది. కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ యొక్క కొత్త XBB.1.16 వేరియంట్ తీవ్రతకు దారితీస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Covid-19 Cases: 24గంటల్లో భారీగా నమోదైన కొవిడ్ కేసులు.. 50వేలకు చేరువలో యాక్టివ్ కేసుల సంఖ్య

తాజా గణాంకాల ప్రకారం.. కరోనా కేసుల రికవరీ రేటు 98.71శాతం వద్ద కొనసాగుతుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.01శాతంగా నమోదైంది. వారానికి అనుకూలత రేటు 4.29శాతంగా ఉంది. 4,42,16,583 మంది ఇప్పటి వరకు కరోనా బారినపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 12న 7,830 కొత్త కేసులు నమోదు కాగా, 13న 10,158 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యయాయి. శుక్రవారం (14వ తేదీ) కొత్త కేసుల సంఖ్య 11,109కు చేరింది. గడిచిన 24గంటల వ్యవధిలో 29మంది కరోనాతో బాధపడుతూ మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,31,064కు పెరిగింది. మరణాల రేటు 1.19శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.

COVID-19 Cases: శుభవార్తే అయినా.. అప్రమత్తంగా ఉండాల్సిందే..! భారత్‌లో వచ్చే పది రోజులు కోవిడ్ ఉద్ధృతి.. ఆ తరువాత..

కొవిడ్ కారణంగా ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముగ్గురు చొప్పున, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.