ఆహా ఏమి రుచి : తీహార్ జైల్లో కొత్త మెనూ

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 06:38 AM IST
ఆహా ఏమి రుచి : తీహార్ జైల్లో కొత్త మెనూ

ఢిల్లీ : తీహర్ ఖైదీలు ఇప్పుడు సరికొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా జైల్లో భోజనం అంటే చిప్పకూడు అంటు తేలిగ్గా అనేస్తారు. కానీ తీహార్ జైలు ఖైదీలు మాత్రం  పావ్ భాజీ, బెడ్హామీ పూరి..మలై చాప్ వంటి వంటకాలను రుచి చూస్తు లొట్టలేస్తున్నారు. 2019లో ఖైదీల మెనులో మార్పులు చేసింది తీహార్ జైల్. కొత్త సంవత్సరం లో జైలు పరిపాలన తాజా మెనూని ప్రవేశపెట్టింది. తిహార్ ఖైదీలు భోజనంలో క్వాలిటీ లేదని కంప్లైంట్ చేయటంతో వారి డిమాండ్స్ ను ఏక్సప్ చేసిన జైల్  సూపరిండెంట్ మెనూలో మార్పులు చేర్పులు చేశారు. దీంతో జైల్ మెనూలో ఫుడ్ లో కొత్త వంటలను ప్రవేశపెట్టింది. ఈ మార్పుల్లో భాగంగా  ఇప్పుడు తీహార్ జైల్ ఖైదీలు పావ్ భాజీ, బెడ్హామీ పురీ, చోళే భుచర్ మరియు ఖీర్స్ ల టేస్ట్ లను ఆస్వాదిస్తున్నారు. దీనిపై ఖైదీలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.