Newly Married Dead: పెళ్లి ఫోటో షూట్ పిచ్చి: నదిలో కొట్టుకుపోయిన నవజంట
నదీప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోగా..వెంటనే స్పందించిన స్థానికులు..ఇద్దరినీ ఒడ్డుకి చేర్చారు. అయితే అప్పటికే రెజిన్ లాల్ మృతి చెందగా..కొనఊపిరితో ఉన్న కనికాను సమీప ఆసుపత్రికి తరలించా

Keral
Newly Married Dead: ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటూ నవతరం పెళ్లి జంటలు ఈమధ్య ఫోటో షూట్ లతో తమ కొత్త జీవితాన్ని క్షణకాలం పాటు కెమెరాలో బందిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి. లేనిపోని పిచ్చి ప్రయాసలకు పోతే జీవితమే తలకిందులవుతుంది. ఫోటో షూట్ కోసమంటూ నదిలో దిగిన ఏ నవ జంట నదీప్రవాహానికి కొట్టుకుపోయిన ఘటనలో వరుడు మృతి చెందగా..వధువు తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈఘటన కేరళలోని కోజికోడ్ జిల్లా చావరమూస్హ్య్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కోజికోడ్ కి చెందిన రెజిన్ లాల్ అనే యువకుడు కనికా అనే యువతీకి మార్చి 14న వివాహం జరిగింది. సోమవారం వీరిరువురు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక కుట్టియాడి నది వద్దకు వెళ్లారు.
Also read:Old woman : తన ఆస్తిమొత్తాన్ని రాహుల్ గాంధీ పేరిట రాసిచ్చిన 78ఏళ్ల వృద్ధురాలు.. కారణమేమిటంటే?
బంధువులు నది వొడ్డున కూర్చుని ఉండగా..రెజిన్ లాల్ మరియు అతని భార్య కనికా ఇద్దరు నదిలో ఫోటో షూట్ చేస్తున్నారు. ఇంతలో నదీప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోగా..వెంటనే స్పందించిన స్థానికులు..ఇద్దరినీ ఒడ్డుకి చేర్చారు. అయితే అప్పటికే రెజిన్ లాల్ మృతి చెందగా..కొనఊపిరితో ఉన్న కనికాను సమీపంలోని మలబార్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కనికా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఇక ఈఘటనపై కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నదిలో దిగరాదని..దిగినా ఫోటో షూట్ లు చేయరాదని అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా కొందరు అత్యుత్సాహానికి వెళ్లి ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని స్థానిక పోలీసులు చెప్పుకొచ్చారు. పెళ్ళైన రెండు వారాలకే రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపడం స్థానికంగా అందరిని కలచివేసింది.
Also Read:Telangana : తాగుబోతు భర్తను హత్యచేసిన అత్తింటివారు