హై అలర్ట్ : ఏప్రిల్ 30న ఆంధ్ర-తమిళనాడు మధ్య తీరం దాటనున్న తుఫాన్
భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఏప్రిల్ 30వ తేదీన తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.

భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఏప్రిల్ 30వ తేదీన తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ గంట గంటకు తీవ్ర రూపం దాల్చుతుంది. రాబోయే 24 గంటల్లో తీవ్రమైన తుఫాన్ గా మారనున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంకకు 870 కిలోమీటర్ల దూరంలో.. చెన్నైకి 1210 కిలోమీటర్ల దూరంలో.. మచిలీపట్నంకి 1500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఫణి తుఫాన్.. భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఏప్రిల్ 30వ తేదీన తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.
రాబోయే 12 గంటల నుంచి తుఫాన్ ఎఫెక్ట్ తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై ఉండనున్నట్లు ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. తీరం వెంట 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని.. అదే సముద్రంలో అయితే 70-80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని వెల్లడించారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ తీరం దాటే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సలహా ఇచ్చారు.
తమిళనాడు-ఆంధ్ర మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండటంతో.. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 48 గంటల్లో ఏ ప్రాంతంలో తుఫాన్ తీరం దాటిదే స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రస్తుతం ఫణి తుఫాన్ గంటకు 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. మరింత బలపడే కొద్దీ వేగం, దిశలో మార్పులు వస్తాయని వివరించారు అధికారులు.