NIA Raids : ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్ బంధంపై ఎన్ఐఏ దాడులు

దేశంలో ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్ బంధంపై ఎన్ఐఏ అధికారులు బుధవారం దాడులు చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బుధవారం పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది....

NIA Raids : ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్ బంధంపై ఎన్ఐఏ దాడులు

NIA Raids

Updated On : September 27, 2023 / 8:27 AM IST

NIA Raids : దేశంలో ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్ బంధంపై ఎన్ఐఏ అధికారులు బుధవారం దాడులు చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బుధవారం పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. పలు రాష్ట్రాల్లోని 50కి పైగా ప్రాంతాల్లో దాడులు చేశారు. (NIA raids several states)

Khalistani terrorist : కెనడాలోకి పన్నూన్ ప్రవేశాన్ని నిషేధించాలని హిందూ గ్రూప్ డిమాండ్

బ్రిటీష్ కొలంబియాలో జూన్ 18వతేదీన తన దేశ గడ్డపై ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హత్య చేయడంలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత భారత్,కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థానీ,గ్యాంగ్‌స్టర్ మధ్య బంధంతో ఆయుధాల కోసం హవాలా మార్గాల ద్వారా నిధులు సమకూరాయని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. (Khalistani-gangster nexus)

Iraq Fire During Wedding : ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం…100మంది మృతి, 150 మందికి గాయాలు

ఖలిస్థాన్ ఉగ్రవాదులు నిధులు సమకూర్చడం, ఆయుధాల సరఫరా, విదేశీ నేల నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం వంటి వాటితో సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. పంజాబ్‌లోని 30, రాజస్థాన్‌లో 13, హర్యానాలో నాలుగు, ఉత్తరాఖండ్‌లోని రెండు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం సోదాలు చేశారు. దౌత్యపరమైన గొడవల మధ్య కెనడియన్ పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారతదేశం ఇటీవల ప్రకటించింది.