నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6గంటలకు ఉరి

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6గంటలకు ఉరి

Updated On : January 17, 2020 / 11:23 AM IST

నిర్భయ కేసులో దోషులైన నలుగురిని ఫిబ్రవరి 1న ఉరి వేయనున్నట్లు ఢిల్లీ కోర్టు వెల్లడించింది. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా జనవరి 22న వేయాల్సిన ఉరిని వాయిదా వేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు తన ఉరిని వాయిదా వేయాలంటూ ముఖేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ ను కొట్టివేసిన తర్వాత ఢిల్లీ కోర్టు తేదీ మార్చింది. 

వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలను జనవరి 22న ఉరి తీయాలంటూ ముగ్గురు జడ్జిల ధర్మాసనం గత వారమే వెల్లడించింది. కదులుతున్న బస్సులో మెడికోపై అత్యాచారం జరిపి హింసకు గురి చేసి హత్యకు కారణమైన వారు ఏడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. 

ఏదేమైనప్పటికీ గురువారం సరిగ్గా ఉరికి ఐదు రోజు ముందు తేదీని పొడిగించారు. తీహార్ జైలు అధికారులు క్షమాభిక్ష కోసం ఎదురుచూసిన దోషి గురించి కొత్త తేదీ వస్తుందని ఎదురుచూశారు. అన్ని పిటిషన్లు పూర్తయ్యేంతవరకూ ఎటువంటి శిక్షలు మంజూరు కావు. పిటిషన్ దాఖలైన 14రోజుల పాటు పరిశీలించి ఆ తర్వాతే నిర్ణయాన్ని తెలియజేస్తారు. ఈ కారణంతోనే శిక్ష మంజూరుకు ఆలస్యమవుతోంది.