నిర్భయ తల్లిని శిక్షించాలి..దోషుల తరపు లాయర్ సంచలన వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : March 20, 2020 / 02:59 AM IST
నిర్భయ తల్లిని శిక్షించాలి..దోషుల తరపు లాయర్ సంచలన వ్యాఖ్యలు

Updated On : March 20, 2020 / 2:59 AM IST

నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరి శిక్ష పడింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులు ( ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌) తీహార్ జైలులో ఉరి వేశారు. కానీ ఈ దోషుల తరపున వాదించిన అడ్వకేట్ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉరి శిక్ష పడిన అనంతరం సింగ్ మీడియాతో మాట్లాడుతూ…నిర్భయ తల్లిని శిక్షించాలంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. 

రాత్రి 12 గంటల వరకు తన కూతురు  ఎక్కుడుందో, ఎవరితో ఉందో తెలియని నిర్భయ తల్లి ఆశాదేవిని శిక్షించాలని డిమాండ్ చేశాడు. SC బార్ అసోసియేషన్ ఆలోచించుకోవాలని సూచించారు. ఈయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో ఏపీ సింగ్‌ను తూర్పారబడుతున్నారు. న్యాయవ్యవస్థలోని ఉన్న లొసుగులను వాడుకుంటూ..ఏడేళ్ల పాటు నలుగురిని శిక్ష నుంచి తప్పిస్తూ వచ్చారు న్యాయవాది ఏపీ సింగ్. 

ఉరిపై స్టే ఇవ్వాలన్న దోషుల అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడం, ఆపై సుప్రీంకోర్టు వెళ్లినా చావుదెబ్బ తగలడంతో ఎట్టకేలకు నలుగురూ ఉరి కంభానికి వేలాడారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో శిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషులు చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన స్టే పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టిపారేయడంతో నలుగురు దోషులు ముకేశ్ కుమార్, పవన్‌ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ని ఉరితీశారు. నాలుగో డెత్‌ వారెంట్ మేరకు వారికి 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు శిక్షను అమలు చేశారు. దీనిపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తీహార్ జైలు బయట సంబరాలు మిన్నంటాయి. 
 

See Also |  చట్టాలన్ని చుట్టేశాడు.. ఆఖరి నిమిషం వరకు.. నిర్భయ రేపిస్ట్‌ల లాయర్ ఓడిపోయాడు