Priyanka Gandhi: ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎన్నికల సంఘం పనిచేస్తోంది -ప్రియాంక గాంధీ

ప్రయాగ్‌రాజ్‌లో యువజన మ్యానిఫెస్టోను విడుదల చేయకుండా కాంగ్రెస్ పార్టీని అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.

Priyanka Gandhi:  ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎన్నికల సంఘం పనిచేస్తోంది -ప్రియాంక గాంధీ

Priyanka Gandhi

Updated On : January 30, 2022 / 6:59 AM IST

Priyanka Gandhi: ప్రయాగ్‌రాజ్‌లో యువజన మ్యానిఫెస్టోను విడుదల చేయకుండా కాంగ్రెస్ పార్టీని అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ.. ఆ పార్టీ నేతలు ద్వేషపూరితమైన మాటలు ఎన్ని మాట్లాడినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

అధికారుల నుంచి ఈ విషయంలో ఎటువంటి చర్యలు లేవని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రయాగ్‌రాజ్‌లో యువజన మ్యానిఫెస్టోను మాత్రం విడుదల చేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ, “బీజేపీ నాయకులు జనాల్లో ప్రచారం చేసుకుంటారు.

ద్వేషపూరితమైన మాటలు నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం పనిచేస్తుంది. యువత ఎజెండాను అణిచివేసి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే పనిలో అధికారులే నిమగ్నమై ఉండడం.. న్యాయమా?” అని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను క్రమబద్ధీకరించి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెల్లడించారు. న్యూఢిల్లీలో యువకుల బృందంతో జరిగిన ఇంటరాక్షన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ విభాగాల్లో నియామకాల స్థితిగతులపై ప్రియాంక చర్చించారు.

కుల, మత రాజకీయాల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రియాంక గాంధీ యువతకు దిశానిర్దేశం చేశారు. కుల, మత రాజకీయాల వల్ల ఉపాధి రాదు.. విద్యా సంస్థలు తయారవ్వవు. భవిష్యత్ అంధకారం అవుతుంది. ఎన్నికల సమయంలో బీజేపీ ఉపాధి గురించి మాట్లాడకపోవడానికి ఇదే కారణం.. అని అన్నారు ప్రియాంక గాంధీ.