NDA vs INDIA: కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఆమోదం తెలిపిన లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా

మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి మౌనం వీడాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.

NDA vs INDIA: కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఆమోదం తెలిపిన లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా

Updated On : July 26, 2023 / 2:17 PM IST

No Confidence Motion: కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో ముందడుగు పడింది. లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఈ తీర్మానంపై స్పీకర్ స్పందిస్తూ ‘‘నేను అన్ని పార్టీల నాయకులతో చర్చించి, దీనిని చర్చకు తీసుకోవడానికి తగిన సమయాన్ని మీకు తెలియజేస్తాను’’ అని తెలిపారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి మౌనం వీడాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. రూల్ 198 (బి) కింద ఈ అవిశ్వాస నోటీసుపై చర్చ చేపట్టాలని ఎంపీ నామా కోరారు.

Assam: ఫేస్‌బుక్ ప్రేమ.. మూడేళ్ల తరువాత భార్య, ఆమె తల్లిదండ్రులను హత్యచేసిన భర్త .. అసలేం జరిగిందంటే?

కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు. కేంద్రం‌పై అవిశ్వాస తీర్మానం విపక్షాల వెర్రికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. సంఖ్యా పరంగా అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని చెప్పారు. బీజేపీ ఎన్డీఏకి 330 పైగా సంఖ్యాబలం ఉందని అన్నారు. అవిశ్వాసం‌పై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల దుమ్ము దులుపుతారని జీవీఎల్ అన్నారు. విపక్షాల అవిశ్వాసం వారి సెల్ఫ్ డిస్ట్రక్షన్ బటన్ మాత్రమే. కేంద్ర ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం అద్భుత సువర్ణ అవకాశం. అవిశ్వాసం వల్ల బీజేపీకి నష్టం లేదని జీవీఎల్ అన్నారు. పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు మా విజయాలను, పాలనను తెలుపుకునే అవకాశం లభించిందని చెప్పారు. అవిశ్వాసం చర్చ సందర్భంగా మణిపూర్ అంశం‌పైనా మోడీ మాట్లాడుతారని జీవీఎల్ అన్నారు.