జూన్ 30వరకు….లాక్ డౌన్ ఆర్డర్స్ కఠినతరం చేసిన యోగి సర్కార్

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 07:35 AM IST
జూన్ 30వరకు….లాక్ డౌన్ ఆర్డర్స్ కఠినతరం చేసిన యోగి సర్కార్

Updated On : April 28, 2020 / 7:35 AM IST

కరోనా కేసులు నెమ్మదిగా పెరిగిపోతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో…రాష్ట్రంలో జూన్-30వరకు ఎక్కువమంది ప్రజలు ఒకచోట ఉండటాన్ని(పబ్లిక్ గేథరింగ్) అనుమతించలేదని యోగి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

జూన్-30వరకు ఓ ప్లేస్ లో ప్రజలు గుంపులుగా ఉండటాన్ని అనుమతించబోమని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తెలిపింది. కేంద్రప్రభుత్వం ఒక వేళ లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా పెళ్లి కార్యక్రమాలు,పుట్టినరోజు పార్టీలు మరియు ఎక్కువమంది ప్రజలు ఒక చోట చేరే మరేవిధమైన కార్యక్రమాలను కూడా అనుమతించేది లేదని యూపీ సర్కార్ సృష్టం చేసింది. కాగా,యూపీలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పుడు 1694 కు చేరుకుంది. శుక్రవారం, కొత్తగా 139కేసులు నమోదయ్యాయి. 226 మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారు.