Bengaluru : బాబోయ్.. అక్కడ వాహనం పార్క్ చేస్తే అన్ని శాపనార్థాలా?

నో పార్కింగ్ బోర్డులందు ఈ బోర్డు వేరయా అన్నట్లుంది బెంగళూరులోని ఓ భవనానికి తగిలించిన బోర్డు. అక్కడ కానీ మీ వాహనం పార్క్ చేసారో? శాపనార్థాలే... ఇక.

Bengaluru :  బాబోయ్.. అక్కడ వాహనం పార్క్ చేస్తే అన్ని శాపనార్థాలా?

Bengaluru

Bengaluru : చాలామంది తమ ఇళ్ల ముందు వాహనాలు పార్క్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తూ బోర్డులు పెడుతుంటారు. ఈ బోర్డులు చాలామంది చూసినా నిర్లక్ష్యంగా పార్క్ చేస్తుంటారు. బెంగళూరులో ఓ బిల్డింగ్ గ్రిల్స్‌కి పెట్టిన బోర్డు చూస్తే పొట్ట పట్టుకుంటారు. ఆ శాపనార్థాలకు మామూలుగా నవ్వురాదు.

Bangaluru: ఇది రీల్ కాదు బాస్ రియల్.. బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తే ముక్కున వేలేసుకుంటారు

కార్లు, లారీలు వంటి కొన్ని వాహనాల వెనుక వాటి యజమానులు రాసే హెచ్చరికలు నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్ని వాహనాలపై దిష్టి తగలకుండా ‘నీ ఏడుపే మా ఎదుగుదల’, ‘అప్పు చేసి కొన్నాను ఏడవకురా’, ‘అసూయా నీకో నమస్కారం’ .. ఇలా కనిపిస్తుంటాయి. ఇవి చాలామంది చూసే ఉంటారు. ఇక మహానగరమైన బెంగళూరులో  నో పార్కింగ్ బోర్డుల్లో సైతం క్రియేటివిటీ చూపిస్తున్నారు.

పార్కింగ్ నిషేధిత ప్రాంతాల్లో వాహనాలు నిలపకండి అంటూ చాలాచోట్ల నో పార్కింగ్ బోర్డ్స్ చూస్తుంటాం. అయితే బెంగళూరులో ఓ బిల్డింగ్ గ్రిల్స్‌కి తగిలించిన నో పార్కింగ్ బోర్డులో ఏం రాశారో తెలిస్తే.. మొదట షాకై.. తర్వాత నవ్వు ఆపుకోలేరు. హాస్యం జోడిస్తూనే శాపనార్థాలు పెడుతూ రాసిన ఆ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పార్కింగ్ నిషేధించబడింది’ అని పేర్కొంటూనే ‘పూర్వీకుల శాపాలన్నీ నీకు తగులుతాయి.. క్రూరమైన ఉడుతలు మీ ఇంటిపై దాడి చేస్తాయి.. మీ జీవితంలో అన్నీ చెడ్డరోజులే.. మీ ఫ్రిడ్జ్‌లో ఫుడ్ అంతా చెడిపోతుంది.. మీ వెహికల్ ఆపకుండా శబ్దం చేస్తుంది.. మీ టైర్లు రోజు పంక్చర్ అవుతాయి.. దోమలు మిమ్మల్ని ఎక్కువగా కుడతాయి.. పార్టీలలో ఎవరూ మీతో మాట్లాడరు.. మీ జోకులకు ఎవరూ నవ్వరు.. మిమ్మల్ని ఎవరూ ఇష్టపడరు’ అంటూ శాపాల లిస్ట్ చాలానే ఉంది.

Kalkaji Temple : ఢిల్లీలో విషాదం.. కల్కాజీ ఆలయంలో అర్థరాత్రి కచేరి సమయంలో కూలిన వేదిక.. వీడియో వైరల్

నో పార్కింగ్ బోర్డు పెట్టడంలో తప్పు లేదు కానీ.. ఇలా హాస్యాన్ని జోడించి శాపనార్థాలు పెడుతూ ఏర్పాటు చేసిన బోర్డుపై చాలామంది నవ్వుకున్నారు. బెంగళూరులో గతంలో కూడా ఇలాంటి బోర్డులు దర్శనం ఇచ్చాయి. కోరమంగళ ప్రాంతంలో నో పార్కింగ్ బోర్డులు వైరల్‌గా మారాయి. ఈ బోర్డులు ముఖ్యంగా సిటీలో ఎదురవుతున్న పార్కింగ్ సమస్యల్ని ఎత్తి చూపించాయి. మీడియాలో విస్తృతంగా  చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఈ నో పార్కింగ్ బోర్డు మాత్రం వైరల్ అవుతోంది.