Water : ఆ ఊరిలో మగ పిల్లలకు పెళ్లి అవటం కష్టం

మధ్య ప్రదేశ్ లోని ఆ ఊళ్లో మగపిల్లలకు పెళ్లి అవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే  గ్రామంలో  సరైన నీటి వసతి లేదు. గుక్కెడునీటి కోసం కిలో మీటర్లుదూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే తల్లితండ్రులు భయపడతారు.

Water : ఆ ఊరిలో మగ పిల్లలకు పెళ్లి అవటం కష్టం

No Water No Marriage

Updated On : May 18, 2022 / 9:00 AM IST

Water : మధ్య ప్రదేశ్ లోని ఆ ఊళ్లో మగపిల్లలకు పెళ్లి అవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే  గ్రామంలో  సరైన నీటి వసతి లేదు. గుక్కెడునీటి కోసం కిలో మీటర్లుదూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే తల్లితండ్రులు భయపడతారు.

మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లాలోని ఖుస్రా గ్రామ అబ్బాయిలు ఈ పరిస్ధితిని ఎదుర్కోంటున్నారు. ఉర్లో ఏ ఒక్క ఇంటికి నల్లా కనెక్షన్ లేదు. ఊరవతల కిలో మీటర్లు దూరంలో ఎక్కడో అడవిలో ఉన్న చిన్ననీటి కాలువే ఖుస్త్రా గ్రామానికి నీటి ఆధారం. గ్రామంలో ప్రతి ఇంటినుంచి ఒకరికి ఇక్కడినుంచి నీళ్లు తీసుకురావటమే పని. గుక్కెడు నీళ్ల కోసం కూడా కిలో మీటర్ల దూరం నడవాల్సివస్తోందని.. కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ నేన్ సింగ్  ఠాకూర్ చెప్పారు.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కూడా దాదాపు ఇలాంటి పరిస్ధితే ఉంది.  300 మంది నివసించే దండిచి బారి గ్రామ ప్రజలు వర్షాకాలంలో వానలపై ఆధారపడి జీవిస్తున్నారు.  వానలు కురిసినప్పుడు వ్యవసాయం… మిగిలిన సమాయాల్లో కాంట్రాక్టు పనులపై ఆధార పడుతున్నారు. గ్రామంలోని ఒక్క బావి ఎండిపోవటంతో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత గ్రామంలోని మహిళలు నీరు తీసుకురావటానికి దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ముప్పావు గంట నడిచి వెళ్తే గానీ నీరు దొరకని పరిస్ధితి ఏర్పడింది.

నీటి సమస్యతో ఇతర గ్రామ ప్రజలు తమ ఆడపిల్లలను ఈ ఊరి మగపిల్లలకు ఇచ్చి పెళ్లి చేయటానికి వెనుకంజ వేస్తున్నారు. దండిచి బారి గ్రామం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. తద్వారా సంవత్సరం పొడుగునా బావుల్లో నీరు నిల్వ ఉంచటం కష్టం అవుతోందని స్ధానిక పరిపాలనా అధికారి దీపక్ తెలిపారు. ఒక మహిళ ఆ గ్రామానికి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చింది. నీటి సౌకర్యం లేక పోవటంతో రెండు రోజుల్లోనే ఆమె తన భర్తను విడిచి వెళ్లిపోయిందని గ్రామస్తులు చెప్పారు.

Also Read : Language War : నా మాతృభాష తమిళ్‌కి అడ్డు పడితే ఊరుకోను.. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు..