నోయిడా మెట్రో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

  • Published By: veegamteam ,Published On : February 7, 2019 / 08:04 AM IST
నోయిడా మెట్రో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

Updated On : February 7, 2019 / 8:04 AM IST

ఢిల్లీ : నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ-మెట్రో నోయిడా సెక్టార్ 12  ఏరియాల్లోని మెట్రో ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో  ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న పేషెంట్లను..రక్షించేందుకు ఆసుపత్రి అద్దాలను పగులగొట్టి రెస్క్యూ టీమ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. 

3 వందలకు పైగా పడకలున్న మెట్రో ఆస్పత్రిలో పలువురు పేషెంట్స్..వారితో పాటు వచ్చిన బంధువులతో సహా మంటల్లో చిక్కుకుపోయారు. ఆసుపత్రి లోపల అన్ని విభాగాలకు మంటలు వ్యాపించాయి. దీంతో పొగ దట్టంగా అలముకోవటంతో సహాయక చర్యలకు తీవ్రంగా ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో 50మందికి పైగా పేషెంట్లను రెస్క్యూ టీమ్ రక్షించారు. కాగా ఈ ప్రమాదం ఎలా సంభవించింది అనే విషయం తెలియాల్సి ఉంది.