Padma Awards: పద్మ అవార్డులకు మీ పేరును మీరు ఎలా నామినేట్ చేసుకోవచ్చంటే..?

మొదట రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌ తెరచి, మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి.

Padma Awards: పద్మ అవార్డులకు మీ పేరును మీరు ఎలా నామినేట్ చేసుకోవచ్చంటే..?

Padma Awards

Updated On : January 25, 2025 / 9:36 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇవాళ పద్మ అవార్డులు-2025 ప్రకటించింది. పద్మ అవార్డులకు నామినేషన్ల ప్రక్రియ కొన్ని నెలల ముందే ప్రారంభమైంది. పద్మ అవార్డులకు ఎవరి పేరును వారు నామినేట్‌ చేసుకోవచ్చు.

ఈ అవార్డుల గ్రహీతల స్ఫూర్తితో, మీరు మీ రంగంలో అందిస్తున్న సేవలతో పద్మ అవార్డులు-2026 కోసం మీ పేరును మీరు నామినేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? సింపుల్‌ ప్రాసెస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మీ పేరును మీరు నామినేట్ చేసుకోవచ్చు. కేంద్ర సర్కాను నుంచి ప్రకటన వచ్చిన తర్వాత ఈ దరఖాస్తు చేసుకోవాలి. జాతి, వృత్తి, ప్రాంతం, లింగ భేదం లేకుండా అందరూ పద్మ అవార్డులకు అర్హులే.

Read More: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్ర సర్కారు.. పూర్తి లిస్టు ఇదే..

ఈ విభాగాల్లో సేవ చేసినవారు అప్లై చేసుకోవచ్చు

  • కళలు (సంగీతం, పెయింటింగ్, శిల్పం, ఫోటోగ్రఫీ, సినిమా, థియేటర్ మొదలైనవి)
  • సామాజిక సేవ (సామాజిక సేవ, ధార్మిక సేవ, కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లలో సహకారం మొదలైనవి)
  • ప్రజా వ్యవహారాలు (చట్టం, ప్రజా జీవితం, రాజకీయాలు మొదలైనవి)
  • సైన్స్, ఇంజనీరింగ్ (స్పేస్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్, దాని అనుబంధ సబ్జెక్టులలో పరిశోధన, అభివృద్ధి మొదలైనవి)
  • వాణిజ్యం, పరిశ్రమ (బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాలు, నిర్వహణ, పర్యాటకం, వ్యాపారం మొదలైనవి)
  • మెడిసిన్ (వైద్య పరిశోధన, ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ, అల్లోపతి, నేచురోపతి మొదలైనవి)
  • సాహిత్యం, విద్య (జర్నలిజం, టీచింగ్, బుక్ కంపోజింగ్, సాహిత్యం, కవితలు, విద్యను ప్రోత్సహించడం, అక్షరాస్యతను ప్రోత్సహించడం, విద్యా సంస్కరణలు మొదలైనవి)
  • క్రీడలు (జనాదరణ పొందిన క్రీడలు, అథ్లెటిక్స్, సాహసం, పర్వతారోహణ, క్రీడల ప్రచారం, యోగా మొదలైనవి)
  • భారతీయ సంస్కృతి ప్రచారం, మానవ హక్కుల పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ/పరిరక్షణ మొదలైనవి

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మొదట రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌ తెరచి, మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం మీ ఆధార్ ప్రకారం మీ పేరు, పుట్టిన తేది, ఫోన్ నంబర్ పొందుపర్చాలి. మీ నామినేషన్ టైప్‌ను ఎంచుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మీ మొబైల్ నంబర్‌కు ఎ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి, కొత్త నామినేషన్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. నామినీ వివరాలను పొందుపర్చాలి. ఫొటో, నామినేషన్‌ డాక్యుమెంటేషన్‌ను అప్‌లోడ్ చేయాలి. సబ్మిట్‌పై క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.