Supreme Court: నుపుర్ శర్మకు సుప్రీంలో మళ్లీ ఊరట.. అరెస్ట్ పిటిషన్ తిరస్కరణ
నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అడ్వకేట్ అబు సోహెల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. స్వతంత్ర, విశ్వసనీయమైన, నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించాలని అందులో కోరారు. కాగా, నుపుర్ శర్మపై గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసింది. ఢిల్లీ హైకోర్టు నుంచి తగిన పరిష్కారం కోరాలని శర్మకు సూచించింది.

Nupur Sharma gets relief again in the Supreme Court
Supreme Court: ఇస్లాం మత గురువు మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నుపుర్ శర్మకు సుప్రీంకోర్టు మరోసారి ఊరట కల్పించింది. ఆమెను అరెస్ట్ చేయాలంటూ వేసిన పిటిషన్ను విచారణకు తీసుకునేందుకు సుప్రీం ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. గతంలో సైతం ఇలాంటి పిటిషన్ వస్తే ధర్మాసనం ఇలాగే స్పందించింది. అంతకు ముందు ఒకసారి కొద్ది కాలం పాటు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కాగా తాజా పిటిషన్లో ఆమెను అరెస్ట్ చేయడంతో పాటు, స్వతంత్ర దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు.
ఈ విషయమై స్పందించిన సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇది చాలా సరళమైనదిగా, హానికరం కానిదిగా కనిపించొచ్చని, అయితే చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంటుందని పేర్కొంది. ఆదేశాలు జారీ చేసేటప్పుడు కోర్టు చాలా జాగ్రత్తగా ఉండాలని, కాబట్టి ఈ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నట్టు పేర్కొంది. దీంతో పిటిషనర్ దానిని ఉపసంహరించుకున్నారు. దీనికి ముందు పిటిషన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. మాబ్ లించింగ్ నియంత్రణకు సంబంధించి తహసీన్ పొన్నవాలా తీర్పులోని ఆదేశాలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నట్టు తెలిపారు.
నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అడ్వకేట్ అబు సోహెల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. స్వతంత్ర, విశ్వసనీయమైన, నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించాలని అందులో కోరారు. కాగా, నుపుర్ శర్మపై గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసింది. ఢిల్లీ హైకోర్టు నుంచి తగిన పరిష్కారం కోరాలని శర్మకు సూచించింది.
Bandi sanjay slams kcr: అతిథులను గౌరవించడం మన సంస్కారం.. అసోం సీఎం వస్తే ఇలాగేనా చేసేది?: బండి సంజయ్