CM Morning Walk: మార్నింగ్ వాక్‌లో సీఎం.. ఫిట్‌నెస్ రహస్యాన్ని అడిగిన మహిళ

తమిళనాడు ఫిట్‌నెస్ ఫ్రీక్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మీరింత యంగ్‌గా కనిపించడానికి కారణం ఏంటని అడిగారు ఒక మహిళ.

CM Morning Walk: మార్నింగ్ వాక్‌లో సీఎం.. ఫిట్‌నెస్ రహస్యాన్ని అడిగిన మహిళ

Stalin

Updated On : September 21, 2021 / 3:46 PM IST

Chief Minister MK Stalin: తమిళనాడు ఫిట్‌నెస్ ఫ్రీక్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మీరింత యంగ్‌గా కనిపించడానికి కారణం ఏంటని అడిగారు ఒక మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఈ వీడియోను షేర్ చేయగా.., సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ ప్రశ్నకు స్టాలిన్ సిగ్గుపడుతూ.. డ‌యిట్ కంట్రోల్ అని సమాధానం చెప్పారు.

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ వ‌య‌సు 68 ఏళ్లు అయినా.. స్టాలిన్ చాలా యంగ్‌గా క‌నిపిస్తూ ఉంటారు. స్టాలిన్ చెన్నైలో ప్రతీరోజూ మార్నింగ్ వాక్‌లో ప్రజలను కలుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మహిళ స్టాలిన్‌ని కలుసుకుని అతని ఫిట్‌నెస్ రహస్యాన్ని అడిగింది. స్టాలిన్ ఫిట్‌నెస్ గురించి రాజకీయ వర్గాల్లో తరచుగా చర్చలు జరుగుతున్నాయి. 70 కి చేరుకున్న తర్వాత కూడా, స్టాలిన్ చాలా ఫిట్‌గా మరియు యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.

తరచుగా స్టాలిన్ జిమ్‌లో చెమటలు పట్టే ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ కనిపిస్తుంటారు. సైకిల్ తొక్కడం వంటివి చేస్తుంటారు. అధికార డీఎంకే స్టాలిన్‌ను ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా చూపించేందుకు నిరంతరం వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పటికే స్టాలిన్ వ్యాయామానికి సంబంధించి అనేకసార్లు వీడియోలు బయటకు వచ్చాయి. త‌న జీవితంలో యోగా కూడా భాగ‌మే అని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో స్టాలిన్ తెలిపారు. తమిళనాడు రాజకీయాలు ఒకప్పుడు జయలలిత మరియు కరుణానిధి చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు స్టాలిన్‌ మాత్రం ఏకచత్రాధిపత్యం చేస్తున్నారు.