అసోంలో పడవ ప్రమాదం : ఒకరి గల్లంతు

  • Published By: chvmurthy ,Published On : October 17, 2019 / 02:01 PM IST
అసోంలో పడవ ప్రమాదం : ఒకరి గల్లంతు

Updated On : October 17, 2019 / 2:01 PM IST

ఏపీలో తూర్పు గోదావరి జిల్లా  కచ్చలూరు వద్ద నదిలో పడవ మునిగిపోయిన ఘటన మరువక ముందే…. గురువారం 2019 అక్టోబరు17న అసోం రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది.  అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మిగిలిన వారు ప్రాణాలతో బయట పడ్డారు.  సోనిత్ పూర్ జిల్లా, జముగురిహాట్ వద్ద, జియా భరలి నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగి పోవటంతో ఒక వ్యక్తి గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. 

పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కటం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  గురువారం ఉదయం గం.11-30 ల సమయంలో లాల్ తపూ సమీపంలోని బిహియా అనే గ్రామం  నుంచి తేజ్ పూర్ లోని పంచ్ మైల్ ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గురువారం జరిగే వారాంతపు సంత కోసం స్ధానికులు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటు ఇంజన్ లో లోపం  ఏర్పడిన తర్వాత ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

ప్రమాద సమయంలో బోటులో కొన్ని వాహానాలు కూడా ఉన్నట్లు తెలిసింది. బోటులో 40 నుంచి 50 మంది వరకు ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొందరిని స్ధానికులు రక్షించగా మరికొందరు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు.   సమాచారం అందుకున్న జిల్లా అధికారులు ఎస్డీ.ఆర్.ఎఫ్. సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తప్పిపోయిన ప్రయాణీకుడిని తైజుత్ అలీ (42) గా గుర్తించారు.