Online Class..విద్యార్థిని చేతిలో పేలిన Cell Phone

  • Published By: madhu ,Published On : July 29, 2020 / 12:24 PM IST
Online Class..విద్యార్థిని చేతిలో పేలిన Cell Phone

Updated On : July 29, 2020 / 12:56 PM IST




ఆన్ లైన్ క్లాసులో పాల్గొంటున్న ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడింది. కానీ..ఆమె చేతికి గాయమైంది. సెల్ ఫోన్ తునాతునకలు అయ్యింది.ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురయింది. ఒడిశా రాష్ట్రంలో జరిగింది.

బల్లిఘాయి ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఉండే..రుప్పా పాలై కేంద్రీయ విద్యాలయంలో 7వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా..స్కూళ్లు, పాఠశాలలు తెరవడం లేదు. దీంతో అందరిలాగానే..బాలిక కూడా..ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో కొన్ని స్కూళ్లు..ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నాయి.



బాలిక చదువుతున్న పాఠశాల కూడా Online లో Class లు చెబుతున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్ లో పాఠాలు వింటోంది. ఎప్పటిలాగానే…వింటుండగా..సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. చేతికి గాయమైంది. ఆన్ లైన్ లో క్లాసులు వింటున్న వారు జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థులను తల్లిదండ్రులు గమనించాలని సూచిస్తున్నారు.