India-China face off: రాజ్‌నాథ్ ప్రకటన తర్వాత లోక్‌సభలో గందరగోళం.. విపక్షాల వాకౌట్

లోక్‌సభలో గందరగోళం నెలకొంది. భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ప్రకటన చేసి, వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే విపక్ష పార్టీల నేతలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

India-China face off: రాజ్‌నాథ్ ప్రకటన తర్వాత లోక్‌సభలో గందరగోళం.. విపక్షాల వాకౌట్

India-China face off

Updated On : December 13, 2022 / 1:42 PM IST

India-China face off: లోక్‌సభలో గందరగోళం నెలకొంది. భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ప్రకటన చేసి, వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే విపక్ష పార్టీల నేతలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ శశిథరరూర్ మీడియాతో మాట్లాడుతూ… అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ పై చైనా కన్నేసి ఉంచిందని, ఇందులో ఏ అనుమానమూ లేదని చెప్పారు. ఆ ప్రాంతంలో మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మన ఆర్మీ ఇటీవల చూపిన ధైర్యానికి దేశం మొత్తం మద్దతు తెలుపుతుందని చెప్పారు. ఈ విషయంలో దేశ ప్రజలు, ప్రతి రాజకీయ పార్టీ సభ్యుడూ ఆర్మీకి మద్దతు తెలుపుతున్నారని ప్రపంచానికి చెప్పాలని తాను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చెప్పానని అన్నారు.

మరోవైపు, పార్లమెంటులో గందరగోళం నెలకొన్న విషయంపై కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘లోక్ సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా విపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. వారి తీరును నేను ఖండిస్తున్నాను. చైనా-భారత్ సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై పార్లమెంటులో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎఫ్సీఆర్ఏ ఉల్లంఘనపై లోక్ సభలో ఎవరూ మాట్లాడకుండా భారత్-చైనా సైనికుల ఘర్షణ అంశాన్ని విపక్ష పార్టీలు లేవనెత్తాయి’’ అని చెప్పుకొచ్చారు.

India-China face off: చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు: లోక్‌సభలో రాజ్‌నాథ్ ప్రకటన