EVMలను ట్యాంపరింగ్ చేయొచ్చు – బాబు

  • Published By: madhu ,Published On : April 14, 2019 / 08:08 AM IST
EVMలను ట్యాంపరింగ్ చేయొచ్చు – బాబు

Updated On : April 14, 2019 / 8:08 AM IST

EVMలను ట్యాంపరింగ్ చేయొచ్చని మరోసారి ఏపీ సీఎం బాబు చెప్పారు. ట్యాపరింగ్ చేయడానికి చాలా మార్గాలున్నాయన్నారు. చాలా దేశాలు ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్‌కు వచ్చాయని..ఈవీఎంలతో ఫలితాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోయిందన్నారు బాబు. గత కొన్ని రోజులుగా ఈవీఎంల నిర్వాహణపై పలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఆయన విమర్శలు చేస్తున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి బాబు ఢిల్లీకి వచ్చారు. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం విపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. కానిస్టిట్యూషన్ క్లబ్‌లో ఈ భేటీ జరిగింది. ఏపీ, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేజ్రీవాల్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వీ, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ…ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ కాపాడలేకపోతోందని, కనీసం 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి ఎన్నికల కమిషన్ ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. తాము ప్రశ్నించినందుకు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు. ఏపీలో ఎన్నికల అనంతరం ఎన్నికల కమిషన్ క్షమాపణలు చెప్పి సరిపెట్టుకుందన్నారు. ఎన్నికల సంఘం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.