Corona : 9,346 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని సుప్రీంకోర్టుకు తెలిపిన NCPCR

కరోనా సోకి భారత్ లో 9,346 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. వారందరి సంక్షేమం కోసం ఆరు దశల పథకాన్ని రూపొందించామని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల వివరాలను ఇప్పటికే బాల స్వరాజ్ పోర్టల్ లో అప్ లోడ్ చేశామని వెల్లడించింది.

Corona : 9,346 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని సుప్రీంకోర్టుకు తెలిపిన NCPCR

Ncpcr Affidavit To The Supreme Court (2)

Updated On : June 1, 2021 / 3:46 PM IST

NCPCR Affidavit to the Supreme Court : కరోనా సోకి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న అత్యంత విషాదకర పరిస్థితుల్లో అభం శుభం తెలియని పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోతున్నారు. అనాథలుగా మారుతున్నారు. ఇటువంటి పిల్లలకు ప్రభుత్వాలు అండగా నిలుస్తామని హామీనిస్తున్నాయి. కానీ అది ఎంత వరకూ అమలు అవుతుంది? అమలు జరిగినా అది ఎంత వరకూ వారి అవసరాలను తీరుస్తుంది? వారి భవిష్యత్తు మాట ఏమిటి అనేది మాత్రం ప్రశ్నార్ధకమే.

ఈక్రమంలో కరోనా సోకి భారత్ లో 9,346 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (National Commission for Protection of Child Rights) సుప్రీం కోర్టుకు తెలియజేసింది. వారందరి సంక్షేమం కోసం ఆరు దశల పథకాన్ని రూపొందించామని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల వివరాలను ఇప్పటికే బాల స్వరాజ్ పోర్టల్ లో అప్ లోడ్ చేశామని వెల్లడించింది.

అందులో 1,742 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోగా, 7,464 మంది తల్లి లేదా తండ్రిని కోల్పోయారని, (కొంతమందికి తల్లి ఉండి ఇంకొంతమందికి తండ్రి ఉన్న పరిస్థితి) 140 మంది అనాథలుగా మిగిలిపోయారని పేర్కొంది. 1,224 మంది పిల్లలు సంరక్షకుని అధీనంలో పెరుగుతున్నారని, 985 మందిని కుటుంబ సభ్యులే సంరక్షిస్తున్నారని తెలిపింది. 6,612 మంది తల్లి లేదా తండ్రి వద్ద ఉంటున్నారని చెప్పింది. 31 మందిని ప్రత్యేక దత్తత కేంద్రానికి పంపినట్టు పేర్కొంది. దీని కోసం కొత్తగా బాల స్వరాజ్ పోర్టల్ ను క్రియేట్ చేసి దాంట్లో కరోనా వల్ల తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల వివరాలను అప్ లోడ్ చేశారు.

కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయని పిల్లలు అత్యధికంగా మధ్యప్రదేశ్ లో 318 మంది పిల్లలు ఉండగా..104 మంది అనాథలుగా మిగిలారని వెల్లడించింది. అదే ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా 1,830 మంది పిల్లలు తల్లి లేదా తండ్రిని కోల్పోయారని పేర్కొంది. ఇలా మొత్తం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్లో 3 ఏళ్ల లోపు వారు 788 మంది ఉన్నారని తెలిపింది. 4 నుంచి 7 ఏళ్ల లోపు వారు 1,515 మంది, 8 నుంచి 13 ఏళ్ల మధ్య ఉన్న వారు 3,711 మంది, 14 నుంచి 15 ఏళ్ల వారు 1,620 మంది, 16 నుంచి 17 ఏళ్ల వారు 1,712 మంది పిల్లల తల్లిదండ్రులను కరోనా వల్ల మరణించారని వెల్లడించింది.