NCRB: 2019-2021 కాలంలో మన దేశంలో 13.13 లక్షల మంది మహిళలు, బాలికలు మిస్సయ్యారట
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఈ డేటాను రూపొందించింది. మధ్యప్రదేశ్‌లో 2019-2021 మధ్య 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు కనిపించకుండా పోయారని పార్లమెంటుకు సమాచారం అందించారు

HMO: 2019-2021 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 13.13 లక్షలకు పైగా బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారని గత వారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఇక పోతే కనిపించకుండా పోయిన వారిలో ఎక్కువ మంది మధ్యప్రదేశ్‌కు చెందినవారేనట. ఆ తరువాత స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉన్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ మూడేళ్లలో (2009-21) 18 ఏళ్లు పైబడిన మహిళలు 10,61,648 మంది, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న 2,51,430 మంది బాలికలు అదృశ్యమయ్యారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఈ డేటాను రూపొందించింది. మధ్యప్రదేశ్‌లో 2019-2021 మధ్య 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు కనిపించకుండా పోయారని పార్లమెంటుకు సమాచారం అందించారు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు అదృశ్యమయ్యారు.
Lalu Prasad Yadav: బీజేపీకి కనుక ఆ దమ్ముంటే ఇండియాను తిట్టండి.. లాలూ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఒడిశాలో మూడేళ్లలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు.. ఛత్తీస్‌గఢ్‌లో 49,116 మంది మహిళలు, 10,817 మంది బాలికలు అదృశ్యమయ్యారు. కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. దేశ రాజధానిలో 2019-2021 మధ్య 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఇక జమ్మూ కాశ్మీర్‌లో 8,617 మంది మహిళలు, 1,148 మంది బాలికలు అదృశ్యమయ్యారు.
లైంగిక నేరాలకు వ్యతిరేకంగా సమర్థవంతమైన నిరోధానికి క్రిమినల్ లా (సవరణ) చట్టం 2013 అమలుతో సహా దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. క్రిమినల్ లా (సవరణ) చట్టం 2018 ప్రకారం.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి మరణశిక్షతో సహా మరింత కఠినమైన శిక్షా నిబంధనలతో రూపొందించారు. అయినా ఇవ ఆగడం లేదు. అత్యాచారం కేసుల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేసి, మరో రెండు నెలల్లో ట్రయల్స్‌ను పూర్తి చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది.
Sreejita De : ఆటోలో ప్రియుడికి ఘాటు లిప్ లాక్‌కిస్ ఇచ్చిన బాలీవుడ్ భామ.. వీడియో వైరల్!
ప్రభుత్వం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇది అన్ని అత్యవసర పరిస్థితుల కోసం దేశ వ్యాప్తంగా ఒకే డయల్ నంబర్ (112) వ్యవస్థను అమలు చేస్తోంది. స్మార్ట్ పోలీసింగ్, సేఫ్టీ మేనేజ్‌మెంట్‌కు సహాయం చేయడానికి సాంకేతికతను ఉపయోగించి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై అనే ఈ ఎనిమిది నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లు మొదటి దశలో మంజూరు చేశారు.
పౌరులు అశ్లీలమైన కంటెంట్‌ను నివేదించడానికి హోం మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను సెప్టెంబర్ 20, 2018న ప్రారంభించింది. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల ద్వారా దేశవ్యాప్తంగా లైంగిక నేరస్తుల విచారణ, ట్రాకింగ్‌ను సులభతరం చేయడానికి హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 20, 2018న లైంగిక నేరస్థులపై జాతీయ డేటాబేస్‌ను ప్రారంభించింది.