Congress Challenge to PM Modi: ప్రధానమంత్రికి దమ్ముంటే.. అంటూ మణిపూర్ అంశంపై మోదీని కడిగిపారేసిన కాంగ్రెస్

విపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్(ఇండియా)కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటించి మణిపూర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంది. ఈ ఎంపీలు పలు సహాయక శిబిరాలను సందర్శించి అనంతరం ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు.

Congress Challenge to PM Modi: ప్రధానమంత్రికి దమ్ముంటే.. అంటూ మణిపూర్ అంశంపై మోదీని కడిగిపారేసిన కాంగ్రెస్

Updated On : July 30, 2023 / 4:51 PM IST

Manipur Violence: మణిపూర్ హింసకు సంబంధించి నిరంతర ప్రతిష్టంభన ఉంది. పార్లమెంట్ ఉభయ సభల నుంచి రోడ్డు వరకు బైఠాయించి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. భారత ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A.) ప్రతినిధి బృందం మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించి గవర్నర్‌కు శాంతి పత్రాన్ని సమర్పించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా విరుచుకుపడ్డారు. ప్రధానికి దమ్ము ఉంటే మణిపూర్‌కు వెళ్లాలని, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడాలని, వీటితో పాటు రాజస్థాన్ పర్యటనలో రెడ్ డైరీ గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఎర్రటి టమోటా, ఎర్ర సిలిండర్‌పై సమాధానం చెప్పాలని ఖేడా అన్నారు.

Uttar Pradesh: దివ్యాంగుడి మీద ఇద్దరు జవాన్ల జులుం.. నీళ్లు అడిగినందుకు కిరాతకంగా కొట్టారు

మణిపూర్‌లో మే 3న మైతీ, కుకీ వర్గాల మధ్య హింస మొదలై నేటికీ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్(ఇండియా)కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటించి మణిపూర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంది. ఈ ఎంపీలు పలు సహాయక శిబిరాలను సందర్శించి అనంతరం ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు.

Swami Prasad Maurya: ఏ ఆలయాన్ని తవ్వినా బౌద్ధ విహారాలే కనిపిస్తాయట.. బద్రినాథ్ వ్యాఖ్యల అనంతరం మరింత ఘాటు పెంచిన స్వామి ప్రసాద్ మౌర్య

చురాచంద్‌పూర్‌లోని రెండు సహాయ శిబిరాలను, ఇంఫాల్‌లో ఒకటి, మొయిరాంగ్‌లో ఒక సహాయ శిబిరాన్ని సందర్శించామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. మణిపూర్ ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత త్వరగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లకు దూరంగా ఇక్కడ నివసించాల్సి వస్తోందని, మణిపూర్ ముఖ్యమంత్రి అందరితో కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉందని అధిర్ రంజన్ అన్నారు.