Haryana : రెండు జర్మనీలు కలిసినట్లుగానే.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా కలవాలి : సీఎం సంచలన వ్యాఖ్యలు

రెండుగా విడిపోయిన తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలు కలిసాయి..అటువంటప్పుడు విడిపోయిన భారత్,పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు తిరిగి ఎందుకు ఒక్కటిగా కలవకూడదు? ఈ మూడు దేశాలు కలవాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.

Haryana : రెండు జర్మనీలు కలిసినట్లుగానే.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా కలవాలి : సీఎం సంచలన వ్యాఖ్యలు

Pak..bangladesh..india Can Unite Said Cm Manohar Lal Khattar

Updated On : July 26, 2022 / 12:23 PM IST

Pak..Bangladesh..India Can Unite said CM Manohar Lal : రెండుగా విడిపోయిన తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలు కలిసాయి..అటువంటప్పుడు విడిపోయిన భారత్,పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు తిరిగి ఎందుకు ఒక్కటిగా కలవకూడదు? ఈ మూడు దేశాలు కలవాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. గురుగ్రామ్ లో బీజేపీ జాతీయ మైనార్టీ మోర్చా మూడు రోజుల ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తూర్పు, పశ్చిమ జర్మనీలు కలిసిపోయి ఎంతో కాలం కాలేదని… 1991లో రెండు దేశాలు కలిసిపోయాయని… ఇరు దేశాల ప్రజలు బెర్లిన్ గోడను బద్దలుకొట్టారు అంటూ చెప్పుకొచ్చారు సీఎం ఖట్టర్. 1947లో భారత దేశం విడిపోవటం అత్యంత బాధాకరమైన విషయం..ఈ విభజన మతపరమైన ప్రాతిపదికన జరిగింది అంటూ ఆవేదన వ్యక్తంచేశారు సీఎం.

కానీ మూడు ముక్కలుగా విడిపోయిన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు మళ్లీ కలవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలు తిరిగి కలిసిపోయాయి అవి కలిసినట్లుగానే విడిపోయిన మన మూడు దేశాలు కూడా కలవడం సాధ్యమేనని అన్నారు. విడిపోయిన రెండు జర్మనీలు కలసిపోయినప్పుడు… మన మూడు దేశాలు కలవడం ఎందుకు సాధ్యం కాదు? అంటూ ప్రశ్నించారు. తూర్పు, పశ్చిమ జర్మనీలు కలిసిపోయి ఎంతో కాలం కాలేదు..కానీ అవి తిరిగి 1991లో రెండు దేశాలు కలిసిపోయాయి..ప్రజలు కలవాలని ఆకాంక్షించారు అందుకే బెర్లిన్ గోడను బద్దలుకొట్టారని అటువంటి ఆకాంక్ష మనకు కూడా కలగాలని అన్నారు.

దేశ విభజన తర్వాత మైనార్టీ ప్రజలకు మైనార్టీ ట్యాగ్ ఇచ్చారని… భయం, అభద్రతాభావంతో వారు అభివృద్ధి చెందలేకపోయారని ఖట్టర్ ఈ సందర్భంగా అన్నారు. పొరుగు దేశాలతో భారత్ మంచి సంబంధాలను కొనసాగించాలని సీఎం ఖట్టం ఆకాంక్షించారు. ఆరెస్సెస్ ను బూచిగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల్లో అభద్రతా భావాన్ని నింపింది అంటూ ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు.కానీ ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజలు అర్థం చేసుకున్నారని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు.