షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

హైదరాబాద్ : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా భర్త..పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పై హైదరాబాదీలు ఫైర్ అయ్యారు. పుల్వామా దాడి అనంతరం భారత్- పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో షోయాబ్ ‘హమారా పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ షోయబ్ మాలిక్ ట్వీట్ చేయడంతో… నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. హైదరాబాదులో అడుగు పెడితే తాట తీస్తాం అంటు హెచ్చరిస్తున్నారు. భర్త షోయాబ్ మాలిక్ పెట్టిన ట్వీట్ పై సానియా స్పందించాలని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.
Read Also : అభినందన్ ను భారత హైకమిషన్ కు అప్పగించిన పాక్
ఈ అంశంపై హైదరాబాద్ ఓల్డ్ సిటీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఘాటుగా స్పందించారు. సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించారు. ‘దేశం మొత్తం పాకిస్థాన్ కు, పాక్ టెర్రరిస్టులకు, పాక్ ఆర్మీ చర్యలకు వ్యతిరేకంగా ఉంటే… మన బ్రాండ్ అంబాసిడర్ భర్త మాత్రం భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడనీ..వీటిని ఎంత మాత్రం సహించలేం’ అంటూ మండిపడ్డారు.
Read Also : మనుషులు బతకాలంటే… ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే
కాగా..పుల్వామా దాడి తరువాత సానియా మీర్జా సోదరి డిజైన్ చేసిన దుస్తులు ధరించిన ఫోటోలను సానియా తన ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ సందర్భంలోకూడా సానిమాపై నెటిజన్స్ మండిపడ్డారు. భారత జవాన్లు పాక్ ఉ్రగవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోతే నీకు డిజైనర్ డ్రెస్ లు వేసుకుని పోస్టు లేంటి నీకసలు దేశ భక్తి ఉందా..పాకిస్థాన్ కోడలుగా కాదు భారత్ ఆడబిడ్డగా ఆలోచించు అంటు నెటిజన్స్ ఏకి పడేశారు.
Hamara #PakistanZindabad ????
— Shoaib Malik ?? (@realshoaibmalik) February 27, 2019