విమానం గాల్లో ఉండగా బాత్‌రూంలోకి వెళ్లిన వ్యక్తి అరెస్ట్.. ఏం చేశాడంటే..?

విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం తరచూ చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది.

విమానం గాల్లో ఉండగా బాత్‌రూంలోకి వెళ్లిన వ్యక్తి అరెస్ట్.. ఏం చేశాడంటే..?

IndiGo flight

Updated On : June 29, 2024 / 10:17 AM IST

IndiGo flight : విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం తరచూ చూస్తున్నాం. ఓ సందర్భంలో జంట బాత్‌రూంలోకి వెళ్లి అభ్యంతరకర స్థితిలో దొరికిపోయింది. మరోసారి ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటన సంచలనం సృష్టించింది. ఇలా విమానాల్లో కొందరు ప్రయాణీకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు.

Also Read : CM Chandra babu : పింఛ‌న్‌దారుల‌కు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ.. కీలక విషయాలు వెల్లడి

వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి వెళ్తున్న విమానంలో ఓ వ్యక్తి బాత్‌రూంలోకి వెళ్లి నిబంధనలకు విరుద్దంగా వహరించారు. బుధవారం సాయంత్రం 5.15 గంటలకు 176 మంది ప్రయాణికులతో కూడిన ఇండిగో విమానం ఢిల్లీ నుంచి ముంబయికి ప్రయాణికులతో వెళ్తుంది. మరికొద్ది సేపట్లో గమ్యస్థానంకు చేరుతుందనగా.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఖాలీల్ కాజమ్ముల్ ఖాన్ అనే ప్రయాణికుడు విమానం బాత్‌రూంలోకి వెళ్లాడు. అక్కడ సిగరేట్ కాల్చడంతో విమానంలో పొగను గుర్తించే సెన్సర్లు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది అతను బాత్‌రూంలో నుంచి బయటకు రాగానే తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అగ్గిపెట్టి, అతను కాల్చిన సిగరేట్ పీకను గుర్తించారు. ప్రయాణికుడుసైతం తాను సిగరేట్ తాగినట్టు ఒప్పుకున్నారు.

Also Read : వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశారా? పోలవరం శ్వేతపత్రంతో చంద్రబాబు అనుకున్నది సాధించారా?

విమానంలో జరిగిన ఘటనను సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియజేశారు. ముంబయిలో దిగిన తరువాత అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి సహార్ స్టేషన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు.