పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ టూర్ : అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ టూర్‌లో పవన్‌.. కేంద్ర హోమ్‌ మినిస్టర్‌ అమిత్‌షాతో పాటు.. బీజేపీ సీనియర్‌ నాయకుల్ని కలవబోతున్నారు.

  • Published By: veegamteam ,Published On : November 15, 2019 / 05:56 AM IST
పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ టూర్ : అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం

Updated On : November 15, 2019 / 5:56 AM IST

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ టూర్‌లో పవన్‌.. కేంద్ర హోమ్‌ మినిస్టర్‌ అమిత్‌షాతో పాటు.. బీజేపీ సీనియర్‌ నాయకుల్ని కలవబోతున్నారు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ టూర్‌లో పవన్‌.. కేంద్ర హోమ్‌ మినిస్టర్‌ అమిత్‌షాతో పాటు.. బీజేపీ సీనియర్‌ నాయకుల్ని కలవబోతున్నారు. వరుస భేటీలతో పాటు.. అమరావతి, పోలవరం లాంటి ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో పవన్‌ చర్చించబోతున్నారని జనసేన వర్గాలంటున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. 

పవన్ ఢిల్లీ టూర్ పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. ఢిల్లీకి వెళ్లి ఏపీ ప్రభుత్వం అనేక ఫిర్యాదులు చేస్తానని నెల క్రితం పవన్ చెప్పారు. ఈక్రమంలో ఇవాళ సడెన్ గా ఢిల్లీకి వెళ్లడం పట్ల రాజకీయ చర్చ జరుగుతోంది. పవన్ ఢిల్లీ పర్యటనలో పలు కీలక భేటీలు జరుగబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే అమిత్ షాతోపాటు బీజేపీ పెద్దలను, అలాగే అపాయింట్ మెంట్ కుదిరితే ప్రధాని మోడీని కూడా పవన్ కలిసే అవకాశాలున్నట్లు జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

పోలవరం ప్రాజెక్టు, ఏపీ రాజధాని అమరావతి విషయంలో గందరగోలం నెలకొన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఇసుక కొరత అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇసుక కొరతతో పనులు లేక దాదాపు 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని పవన్ విమర్శించారు. వైసీపీ తీసుకున్న ఇసుక పాలసీ వల్ల అనేకమంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.