Aadhar Shila Scheme : మహిళలూ..రోజుకు రూ.29 పొదుపు చేయండీ..రూ.4లక్షలు అందుకోండీ..

మహిళలూ.. రోజుకు రూ.29 పొదుపు చేయండీ..రూ.లక్షలు అందుకోండీ అంటోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎల్‌ఐసీ మహిళలకు స్వావలంబన చేకూర్చాలనే ఉద్ధేశ్యంతో ఆధార్‌ శిలా పథకాన్ని ప్రవేశపెట‍్టింది. దీంట్లో భాగంగా కట్టిన మొత్తానికి గాను అదనంగా రెండు రెట్లు డబ్బుని తీసుకోవచ్చు.

Aadhar Shila Scheme : మహిళలూ..రోజుకు రూ.29 పొదుపు చేయండీ..రూ.4లక్షలు అందుకోండీ..

Adhar Shila

Updated On : August 6, 2021 / 5:16 PM IST

Aadhar Shila nes Scheme : రోజుకు రూ.29 పొదుపు చేయండీ..రూ.లక్షలు అందుకోండీ అంటోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మహిళల కోసం ‘ఆధార్‌ శిలా’ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది ఇన్సూరెన్స్. ఈ పథకంలో భాగంగా కట్టిన మొత్తానికి గాను అదనంగా రెండు రెట్లు డబ్బుని తీసుకోవచ్చు. ఎల్‌ఐసీ మహిళలకు స్వావలంబన చేకూర్చాలనే మంచి ఉద్ధేశ్యంతో ఆధార్‌ శిలా పథకాన్ని ప్రవేశపెట‍్టింది. ఈ పథకంలో 8 ఏళ్లనుంచి 55 ఏళ్ల వయస్సున్న మహిళలు 20ఏళ్లపాటు ఏడాదికి రూ.10,959 అంటే రోజుకి రూ.29 కట్టాల్సి ఉంటుంది. ఇలా కట్టిన మొత్తం 20ఏళ్లకు రూ.2,19,180 అవుతుంది. అవి మెచ‍్యూరిటీ సమయానికి రూ.4లక్షలు అవుతాయి. మెచ్యూరిటీ అయ్యాక వాటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

అంతేకాదు ఈ పథకం రిటర్న్ ఎండోమెంట్ పాలసీ కిందకు వస్తుంది.అంటే పెట్టుబడి ప్లాన్ పై హామీనిచ్చే ఆదాయంతో పాటు..పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఎల్‌ఐసీ సెక్యూరిటీ కవరేజీని అందిస్తోంది. అంటే..ఉదాహరణగా చెప్పాలంటే..పెట్టుబడిదారుడు (పొదుపుచేసిన వ్యక్తి) మెచ్యూరిటీ అవ్వకముందే మరణిస్తే మరణించిన వారి బంధువులకు ఎల్‌ఐసీ ఆర్థిక సహాయం అందిజేస్తుంది. ఈ పాలసీలో భాగంగా కుటుంబానికి రూ .75,000 నుంచి రూ.3,00,000 వరకు ఆర్ధికంగా భరోసా లభిస్తుంది. ఇది ఎల్ఐసీ అందజేస్తుంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా LIC ఆధార్ శిలా ప్లాన్ ముఖ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..

మెచ్యూరిటీ బెనిఫిట్ : పాలసీ గరిష్ట వ్యవధి 20 సంవత్సరాలు మరియు మెచ్యూరిటీ తర్వాత, పాలసీదారుడు కొత్త పాలసీ తీసుకుని ఆ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.

పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణింస్తే..పాలసీ నామినీకి బీమా ప్రయోజనం చెల్లించబడుతుంది. మొదటి ఐదు సంవత్సరాలలో జీవిత భీమా మరణిస్తే, పాలసీ యొక్క నామినీకి హామీ మొత్తం చెల్లించబడుతుంది.