పీడీపీ ఆఫీస్ కి సీల్ వేసిన పోలీసులు

  • Published By: venkaiahnaidu ,Published On : February 17, 2019 / 11:30 AM IST
పీడీపీ ఆఫీస్ కి సీల్ వేసిన పోలీసులు

ఆదివారం(ఫిబ్రవరి-17,2019) జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ పర్యటన సందర్భంగా జమ్మూలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(PDP) ఆఫీస్ కి ఆ రాష్ట్ర పోలీసులు సీల్ వేశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ ఆదివారం మధ్యాహ్నాం జమ్మూలోని పార్టీ ఆఫీస్ కి రావాల్సి ఉంది. పాక్ ఉగ్ర సంస్థ జైషే మహమద్ పుల్వామాలో జరిపిన ఉగ్రదాడి ఘటన సందర్భంగా శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. అంతకుముందు ఆరుగురు వేర్పాటువాద నేతలు మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్,అబ్దుల్ ఘని భాట్,బిలాల్ లోని, హసిమ్ ఖురేషి, ఫజల్ హక్ ఖురేషి, షాబిర్ షాకులకు కేటాయించిన భద్రతను ప్రభుత్వం  ఉపసంహరించుకొంది.