ఫిర్ ఏక్ బార్ ఫడ్నవీస్ సర్కార్

  • Published By: madhu ,Published On : November 23, 2019 / 05:26 AM IST
ఫిర్ ఏక్ బార్ ఫడ్నవీస్ సర్కార్

Updated On : November 23, 2019 / 5:26 AM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఫడ్నవీస్. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం రాజ్ భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. కాంగ్రెస్, శివసేన పార్టీలకు బీజేపీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇటీవలే 288 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 105 సీట్లు బీజేపీ గెలుచుకుంది. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ 145. కానీ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు కలిసి సర్కార్ ఏర్పాటు చేస్తాయని అనుకున్న ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. 

ఇక ఫడ్నవీస్ విషయానికి వస్తే…1970 జులై 22వ తేదీన నాగ్ పూర్‌లో జన్మించారు. నాగర్ పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమృత ఫడ్నవీస్‌తో వివాహమైంది. దివ్య ఫడ్నవీస్ కూతురు ఉంది. 90వ దశకంలోనే రాజకీయ జీవితం ప్రారంభించారు ఆయన. కళాశాల విద్యార్థి నాయకుడిగా..బీజేపీ అనుబంధమైన ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

మొదటి మున్సిపల్ ఎన్నికల్లో రామ్ నగర్ వార్డు నుంచి గెలుపొందారు. ఐదు సంవత్సరాల తర్వాత నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అతి చిన్న వయస్సులో మేయర్ అయ్యారు. 1999 నుంచి మహారాష్ట్ర శాసనసభకు అడుగు పెట్టారు. నాగ్ పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారాయన. రాష్ట్ర అసెంబ్లీలో అనేక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల అనంతరం బీజేపీ శాసనసభా పార్టీ నాయకుడిగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. 2019, నవంబర్ 23వ తేదీన మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు ఫడ్నవీస్.

బీజేవైఎం వార్డు మెంబర్ 1989
నాగ్ పూర్ వెస్ట్ బీజేపీ ఆఫీస్ బేరర్ 1990
నాగ్ పూర్ మేయర్ 1997 -2001
బీజేవైఎం నాగర్ పూర్ ప్రెసిడెంట్ 1992
బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ 1994
మహారాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు 1999
బీజేవైఎం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ 2001
మహారాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ 2010
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు 2013
చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర 2014
చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర 2019
Read More : సగం ధరకే : పెళ్లి కార్డు చూపిస్తే కిలోఉల్లి రూ.35కే