జల జీవన్ మిషన్ : 14 నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లోకి 50శాతం తాగునీటి సరఫరా

tap water supply to rural areas : భారత దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోకి తాగునీటి సరఫరా అందించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన జల జీవన్ మిషన్ (JJM)లో భాగంగా ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాలకు అందించిన తాగు నీటి కనెక్షన్లు 50శాతానికి చేరింది. 5.74 కోట్ల గ్రామీణ వాసులకు పైపులైన్ ద్వారా తాగునీరు అందింది.
గత ఏడాదిలో ఆగస్టు 15 నాటికి 3.24 కోట్లతో 17శాతం పోలిస్తే.. ఈ ఏడాదిలో గురువారం నాటికి 30 శాతం గ్రామీణ వాసులకు తాగునీటి సరఫరా అందినట్టు అధికారిక డేటా వెల్లడించింది. పద్నాలుగన్నర నెలల్లో 50 శాతానికి పైగా తాగునీటి సరఫరా అందించినట్టు డేటా పేర్కొంది.
Covid-19 మహమ్మారి సమయంలోనూ JJM పథకం కింద దేశంలో FY2021లో 1.06 కోట్లతో కలిపి కొత్తగా 1.67 కోట్ల గ్రామీణ వాసులకు తాగునీటి సరఫరా కనెక్షన్లు అందాయి. 2024 నాటికి తాగునీటిని 19 కోట్ల గ్రామీణ ప్రాంత వాసులకు తాగునీరు అందించడమే లక్ష్యమని JJM ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇందుకు అయ్యే ఖర్చు రూ.3.6 లక్షల కోట్లు (కేంద్రం రూ.2.08 లక్షల కోట్లు, రాష్ట్రాల ఖర్చు రూ.98,000 కోట్లు) అంచనా వేస్తోంది.
FY21 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 92,193 పంచాయతీ రాజ్ సంస్థలు, అంగనవాడీలు, స్కూళ్లకు కలిపి టాప్ వాటర్ అందించింది. ఇప్పటివరకూ దేశంలో తాగునీటిని అందించిన రాష్ట్రంగా బీహార్ టాప్ లో నిలిచింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 25.95 లక్షల కొత్త గ్రామీణ వాసులు ఉన్నారు. అందులో తెలంగాణ (17.64 లక్షలు), మహారాష్ట్రలో (11.1 లక్షలు) నల్లా కనెక్షన్లు అందాయి.