PM-KISAN : రైతులకు శుభవార్త…త్వరలో పీఎం కిసాన్ నిధులు…ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలంటే…
దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 15వ విడత ఆర్థికసాయం అర్హులైన రైతులకు త్వరలో అందనున్నాయి....

PM-KISAN
PM-KISAN : దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 15వ విడత ఆర్థికసాయం అర్హులైన రైతులకు త్వరలో అందనున్నాయి. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రెండువేల రూపాయలు జమ చేయనున్నారు. నవంబర్ నెలాఖరులోగా రైతులకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 15వ విడత లబ్ధిదారులు ఈకేవైసీ చేయడం తప్పనిసరి అని, చేయకుంటే వారు పథకం యొక్క ప్రయోజనాలను కోల్పోతారని కేంద్రం పేర్కొంది.
పిఎం కిసాన్ పథకాన్ని 2019వ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్రం కొన్ని మినహాయింపులకు లోబడి సాగు భూమితో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భూస్వామ్య రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 6000 మొత్తాన్ని మూడు నెలల వాయిదాల్లో ఒక్కొక్కరికి రూ. 2000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తారు.
Also Read : Mahua Moitra : మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయండి… ఎథిక్స్ ప్యానెల్ సంచలన సూచన
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నిధుల కోసం ఈకేవైసీ చేసుకునేందుకు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించాలని కేంద్రం సూచించింది. పేజీలో కుడి వైపున, హోమ్ పేజీకి దిగువన మీకు ఫార్మర్స్ కార్నర్ కనిపిస్తుంది. ఫార్మర్స్ కార్నర్‌కు దిగువన ఈకేవైసీ అని ఒక బాక్స్ ఉంది. ఈ కేవైసీపై క్లిక్ చేయాలి.
ఆధార్ లింక్ చేసే పేజీ ఒపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, ఆపై చూపించిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి శోధన బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత, మీరు మీ ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి గెట్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. అనంతరం ఓటీపీలో పంచ్ చేసి, ప్రామాణీకరణ కోసం బటన్‌పై క్లిక్ చేయండి. మీరు ప్రామాణీకరణ కోసం సమర్పించు బటన్‌ను క్లిక్ చేసిన వెంటనే మీ పీఎం కిసాన్ ఇ-కేవైసీ విజయవంతమవుతుంది.