PM KISAN Samman Nidhi: రైతులకు గుడ్‌న్యూస్.. రేపే రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ నిధులు.. మీ పేరు ఉందోలేదో ఎలా చూడాలంటే?

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రతీ యేటా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సన్న, చిన్నకారు రైతులకు రూ. 2వేల చొప్పున మూడు విడుతల్లో కేంద్రం రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటికే 11 సార్లు ఈ నిధులను రైతుల ఖాతాల్లో ప్రధాని మోదీ బటన్ నొక్కి జమ చేశారు. 12వ విడత నిధులు రేపు ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.

PM KISAN Samman Nidhi: రైతులకు గుడ్‌న్యూస్.. రేపే రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ నిధులు.. మీ పేరు ఉందోలేదో ఎలా చూడాలంటే?

PM Kisan Nidi

Updated On : October 16, 2022 / 8:43 AM IST

PM KISAN Samman Nidhi: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రతీ యేటా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. ఇప్పటికే 11 సార్లు ఈ నిధులు రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ అయ్యాయి. తాజాగా 12వ విడత నిధులు జమచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రేపు (సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 12వ విడత నిధుల విడుదలలో మొత్తం రూ.16వేల కోట్లను ప్రధాని విడుదల చేస్తారు.

T20 World Cup 2022: క్రికెట్ పండగ షురూ.. నేటినుంచి టీ20 ప్రపంచ కప్ ఆరంభం.. అసలైన సమరం ఎప్పటినుంచి అంటే?

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలో పీఎం కిసాన్ నిధి యోజన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఈ పథకం కింద 11 విడతలుగా రూ.2వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. చివరి విడతను 2022 మే నెలలో ప్రధాని మోదీ విడుదల చేశారు. దీని కింద దాదాపు రూ. 21,000 కోట్ల నగదు బదిలీ జరిగింది. అయితే 11 విడతల్లో బదిలీ చేయబడిన నగదు రూ. 2.16 లక్షల కోట్లకుపైగా ఉంటుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

లబ్ధిదారుల జాబితాలో మీరు పేరు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి నేరుగా pmkisan.gov.in వెబ్ సైట్‌లో పరిశీలించుకోవచ్చు. తొలుత వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి. డ్రాప్-డౌన్ మెనూలో “బెనిఫిషియరీ స్టేటస్” అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. సరికొత్త వెబ్ పేజీ లోడ్ అవుతుంది. మీరు తప్పనిసరిగా మీ ఆధార్ నంబర్, మీ ఆధార్‌కి కనెక్ట్ చేయబడిన బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయాలి. కొనసాగించడానికి.. ‘డేటా పొందండి’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్థితికి సంబంధించిన మొత్తం సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.