PM-KISAN..రైతులకు గుడ్ న్యూస్..9విడత నిధులు విడుదల
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది

Pm Modi5 (1)
PM-KISAN రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద.. 9వ విడత నిధులను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.75 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2వేల చొప్పున నగదు జమ అయింది. మొత్తంగా రూ.19500కోట్ల నిధులను రైతుల ఖాతాల్లోకి ఇవాళ కేంద్రం బదిలీ చేసింది.
కాగా,పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కేంద్రం.. ఏడాదికి ఆరు వేల పంట పెట్టుబడి సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రతి ఏడాది.. అర్హత గల ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున జమ చేస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి పీఏం కిసాన్ 8 విడతలుగా నగదును జమ చేసింది. మే 15న 8వ విడత డబ్బులను జమ చేశారు. ఇవాళ 9వ విడత డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయ్యింది.